VenuswamyPrabhas : వేణుస్వామి పని అయిపోయినట్టే…. ప్రభాస్ పెట్టుకుంటావా ?

సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి... ఇప్పుడు తన జాతకం చూపించుకోడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలేమో. BRS గెలుస్తుందనీ, IPL లో సనర్ రైజర్స్ ఓడిపోతుందనీ... ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడనీ రకరకాలుగా జాతకాలు చెప్పి... అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంక జ్యోతిష్యం ఆపు నాయనా... అబద్దాలతో ఎన్నాళ్ళు బతుకుతావ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2024 | 03:22 PMLast Updated on: Jun 28, 2024 | 3:23 PM

Venuswamy Prabhas

సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి… ఇప్పుడు తన జాతకం చూపించుకోడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలేమో. BRS గెలుస్తుందనీ, IPL లో సనర్ రైజర్స్ ఓడిపోతుందనీ… ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడనీ రకరకాలుగా జాతకాలు చెప్పి… అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంక జ్యోతిష్యం ఆపు నాయనా… అబద్దాలతో ఎన్నాళ్ళు బతుకుతావ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి వేణుస్వామి పెద్ద టార్గెట్ అయ్యాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతకం బాగోలేదనీ… అనారోగ్య సమస్యలు వస్తాయనీ… సినీ జీవితం ముగిసినట్టే అని జాతకం చెప్పాడు వేణుస్వామి. సరే… ఆయన అన్నట్టే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాఫ్ అయ్యాయి. సలార్ రిలీజ్ కి ముందు… అది కూడా ప్లాప్ అవుతుంది… ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని చెప్పాడు వేణుస్వామి. కానీ సలార్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిట్ కొట్టలేదు కానీ… ఓకే అనుకున్నారు.
ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అమెరికాలో ఆల్రెడీ వసూళ్ళ వర్షం కురిసింది. వెయ్యి కోట్లు పక్కాగా వస్తాయని అంటున్నారు. ప్రభాస్ కెరీర్ క్లోజ్ అని చెప్పిన వేణుస్వామి మరి ఇప్పుడు ఏమంటాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
బాబూ వేణుస్వామి… ముందు నీ జాతకం ఎవరి దగ్గరైనా చూపించుకో నాయనా… నీ జాతకం ప్రకారం నీకు ఏలినాటి శని నడుస్తోంది… పూజలు చేయించుకో అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జ్యోతిష్యాలు మానేసి బుద్దిగా ఉండు… మా డార్లింగ్ తో పెట్టుకుంటే మటాషే అని హెచ్చరిస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ పై వేణుస్వామి ఏమంటాడు.. ఇక ముందైనా ప్రభాస్ జాతకం మాట ఎత్తకుండా ఉంటాడా చూడాలి.