షాకింగ్: ఏపీలో అక్కడ వైన్ షాప్ కు టెండర్ వేస్తే షాప్ మీదే…

ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ గురించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. గత అయిదేళ్ళ నుంచి మద్యం విషయంలో సర్కార్ అనుసరించిన వైఖరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. నూతన మద్యం షాపుల కోసం మందు బాబులో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 06:57 PMLast Updated on: Oct 07, 2024 | 6:57 PM

Very Slow Tenders For Liqcker Shops

ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ గురించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. గత అయిదేళ్ళ నుంచి మద్యం విషయంలో సర్కార్ అనుసరించిన వైఖరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. నూతన మద్యం షాపుల కోసం మందు బాబులో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన బ్రాండ్ లను కూడా ఏపీ సర్కార్ అనుమతి ఇస్తోంది. అలాగే ఏపీలో మద్యం ధర కూడా చాలా తక్కువ అనే వార్తలు వస్తున్నాయి. మద్యం మినిమం ధర కేవలం 99 రూపాయలు మాత్రమే.

ఈ నెల 12 నుంచి మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురు అవుతోంది. సాధారణంగా మద్యం షాపుల కోసం చాలా మంది ముందుకు వస్తారు. దీని కోసం పెద్ద ఎత్తున పోటీ కూడా ఉంటుంది. కాని ఏపీలో మద్యం షాపులకు మందకొడిగా దాఖలవుతున్న టెండర్లు చూసి ఎక్సైజ్ శాఖ షాక్ అవుతోంది. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు కేవలం 8,274 టెండర్లు రావడం చూసి విస్మయం వ్యక్తం చేస్తోంది.

స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు దాదాపు మూడు టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. భారీ ఎత్తున సిండికేట్లుగా మారడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలు అవుతున్నాయి. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు అయ్యాయి. అత్యల్యంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లు దాఖలు అయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్ రివర్స్ అవుతోంది.

తిరుపతి జిల్లాలో 227 షాపులకు కేవలం 165 టెండర్లు రావడం చూసి అధికారులు షాక్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు వచ్చాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు బిడ్డర్లు ముందుకు రావడం లేదు. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు సగటున 5-6 టెండర్లు దాఖలు కాగా ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలు అయ్యాయి. దీనిబట్టి చూస్తే మద్యం షాపుల విషయంలో ఆసక్తి లేదనే విషయం స్పష్టం అవుతోంది. అప్లికేషన్ కు వసూలు చేసిన ఫీజు వెనక్కు రాదు. అందుకే టెండర్ లు వేయడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. అయితే కడప జిల్లాలో మాత్రం మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు దాఖలు అవుతున్నాయి. 139 షాపులకు గాను ఇప్పటివరకు 440 దరఖాస్తులు ఫైల్ అయ్యాయి.

ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్ విధానం ద్వారా 440 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేయడానికి ఇక మూడు రోజులే గడువు ఉండటంతో పోటీ పడుతున్నారు. వీరిలో కర్ణాటకకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. 11 తేది కడప జిల్లా పరిషత్ హాల్లో లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తారు. 12 తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ విధానం మద్యం అమ్మకాలు జరగనున్నాయి.