VICTORY VENKATESH: వెంకీ మామ ప్రచారం.. తెలంగాణలో వెంకటేష్ ఎన్నికల ప్రచారం
వెంకటేష్ పెద్దకూతురు అశ్రితను రఘురాంరెడ్డి కొడుకు వినాయక్ పెళ్లి చేసుకున్నారు. దీంతో వియ్యంకునికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నాడు వెంకటేష్. రఘురాం రెడ్డిది పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబమే ఐనప్పటికీ ఎప్పుడూ ఆయన పొలిటికల్‌గా ప్రొజెక్ట్ అవ్వలేదు.
VICTORY VENKATESH: తెలంగాణలో హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 7న ఖమ్మంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు వెంకటేష్. రఘురాంరెడ్డికి వెంకటేష్ వియ్యంకుడు అవుతారు. వెంకటేష్ పెద్దకూతురు అశ్రితను రఘురాంరెడ్డి కొడుకు వినాయక్ పెళ్లి చేసుకున్నారు.
BJP OUT MANIFESTO: బీజేపీ బొమ్మ మాయం.. కూటమి మేనిఫెస్టో బీజేపీకి ఇష్టం లేదా..?
దీంతో వియ్యంకునికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నాడు వెంకటేష్. రఘురాం రెడ్డిది పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబమే ఐనప్పటికీ ఎప్పుడూ ఆయన పొలిటికల్‌గా ప్రొజెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు అన్నిటికంటే సురక్షితమైన సీటు ఖమ్మం. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ స్థానం నుంచి ఎవరు నిలబడ్డా గెలుపు పక్కా అనేలా ఉంది సిచ్యువేషన్. దీంతో ఖమ్మం ఎంపీ సీటు హాట్‌కేక్‌లా మారిపోయింది. మంత్రులుగా ఉన్న సీనియర్ నేతలు కూడా ఈ సీటు కోసం పోటీ పడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఇప్పించికునేందుకు పైరవీలు చేశారు. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు కూడా జరిగాయి.
కానీ చిట్టచివరికి సీటు పొంగులేటి వియ్యంకుడు రఘురాంరెడ్డికి దక్కింది. దీంతో ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అటు వెంకటేష్ కూడా ఆయనకు వియ్యంకుడు కావడంతో.. వెంకటేష్‌కు ఉన్న సినీ గ్లామర్ కూడా ఇప్పుడు రఘురాంరెడ్డికి కలిసివచ్చే అంశంగా మారింది. తెలుగు టాప్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ పాలిటిక్స్‌లో ఎప్పుడ ఇన్వాల్స్ కాలేదు. ఇప్పుడు మొదటిసారి బావకోసం రోడ్డెక్కుతున్నాడు. సినిమాల్లో పంచ్ డైలాగ్స్ చెప్పే వెంకీ.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఎలాంటి డైలాగ్స్ చెప్తారో చూడాలి.