Vijay Devarakonda: దేవరకొండ ఏం మాట్లాడినా..రివర్స్ అయిపోతుంది
విజయ్ దేవరకొండ చేసే ప్రతి మాట కాంట్ర వర్సీ అవుతోంది. తాజాగా అభిమానులకు డబ్బులు ఇస్తా అనడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలను కొందరు తేలిగ్గా తీసుకున్నా.. అది ఎక్కడో ఒక చోట వివాదం అయిపోతోంది. కోటి రూపాయిలు అభిమానులకు ఇస్తానని విజయ్ అంటే అది కూడా కాంట్రవర్సీ అయింది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అని అంటే పెద్ద గొడవ అయ్యింది. ఇప్పుడు నన్ను తొక్కేస్తున్నారని అంటే మరో గొడవ అయింది. ఇప్పుడు ఫ్యాన్స్ కి డబ్బు ఇస్తానంటే అల్లరి అవుతోంది. రౌడీ ఫ్యాన్స్ కి కోటి రూపాయిల సాయం పెద్ద వివాదానికి దారి తీసింది.
సినిమాల్లోకి రాకముందు విజయ్ టార్గెట్ వేరు.. ఆ డ్రీమ్ తీరిన తర్వాత హీరో లక్ష్యం మారిపోయింది. పెద్ద పేరు తెచ్చుకుని.. అమ్మా నాన్నను బాగా చూసుకోవాలి.. సొసైటీలో మంచి పేరు సంపాదించుకోవాలన్న కోరిక తీరడంతో.. అభిమానుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు విజయ్. ఖుషీ రెమ్యునరేషన్‌లో కోటి రూపాయిలను ఒక్కొక్కరికి లక్ష చొప్పున 100 మందిని పంచుతానని వైజాగ్ వేదికగా ఎనౌన్స్ చేశాడు విజయ్.
కోటి రూపాయిలు ప్రకటించగానే.. చాలామంది హర్షం వ్యక్తం చేశారు. అదేమిటోగానీ.. విజయ్ చేసే మంచి పని కూడా కాంట్రవర్సీ అవుతోంది. కరోనా టైంలో కూడా యాప్ పెట్టి సాయం చేస్తే.. రకరకాల అర్థాలతో విమర్శించారు. లేటెస్ట్‌గా కోటి రూపాయిలు ఇవ్వడం మీద అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ వైరల్ అయింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను డిస్ట్రిబ్యూట్ చేస్తే.. ఎనిమిది కోట్ల రూపాయల లాస్ వచ్చిందని ఇప్పుడు బైట పెట్టింది. తమను కూడా ఆదుకోవాలని అభిషేక్ పిక్చర్స్ కోరింది. విజయ్ ఇచ్చే కోటికి.. సినిమా నష్టానికి సంబంధం వుందా? విజయ్‌ను తొక్కేయాలని చూస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అభిషేక్ పిక్చర్స్ ట్వీట్‌తో ఖుషీ బ్లాక్‌బస్టర్ వేదికలో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు నిజమనిపించేలా వున్నాయి. యూ ట్యూబ్‌లో డబ్బులిచ్చి నెగిటివ్ రివ్వ్యూలు రాయిస్తున్నారని.. కొందరు కావాలని చేస్తున్నారని విజయ్ పేర్కొన్నాడు. ఏదైన సినిమా డిజాస్టర్ అయితే.. నష్టం పూడ్చమని డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలను అడుతారు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో విజయ్‌కు సంబంధం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ని పశ్చిమ గోదావరి జిల్లాలో అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మంచి లాభాలు వచ్చాయి కదా అని విజయ్‌కు షేర్ ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు.
అభిషేక్ పిక్చర్స్ మహేశ్ ‘బ్రహ్మోత్సవం’.. రవితేజ ‘రావణాసుర’ను డిస్ట్రిబ్యూట్ చేయగా భారీ నష్టాలు చూసింది. దీంతో సాయం చేయాలని మహేశ్, రవితేజను అడుగుతూ ట్వీట్ చేయగలరా అంటూ కౌంటర్ వేశారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి విజయ్‌ను అడుగుతున్నారు. పెద్ద హీరోలను అడుగుతారా? అని కొందరు ట్వీట్ చేయడం విశేషం.