Vijayshanthi BRS : బీఆర్ఎస్ కు విజయశాంతి సపోర్ట్.. కాంగ్రెస్ కి గుడ్ బై కొడుతుందా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అక్కడక్కడా మాత్రమే ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 17, 2024 | 03:20 PMLast Updated on: May 17, 2024 | 3:20 PM

Vijayashantis Support For Brs Will It Bid Goodbye To Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అక్కడక్కడా మాత్రమే ఆమె సేవలను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాములమ్మను పిలిచినవాళ్ళు లేరు. ఈ టైమ్ లో ఆమె బీఆర్ఎస్ కు సపోర్ట్ గా మెస్సేజ్ పెట్టడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను విజయశాంతి ఖండించారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూ ఉండటం దక్షిణాది రాష్ట్రాల్లో సహజం. దక్షిణాది గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు, బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయదని ట్విట్టర్ లో కామెంట్ చేశారు విజయశాంతి. కానీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి, పొంగులేటి లాంటి మంత్రులు కూడా అంటున్నారు. కానీ విజయశాంతి మాత్రం … ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు బీజేపీ అర్థం చేసుకోదని మెస్సేజ్ పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

విజయశాంతి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాక ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు. దాంతో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తన పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ లో చేరిన రాములమ్మ… అప్పట్లో కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసింది. మళ్ళీ సడన్ గా బీఆర్ఎస్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయశాంతి మళ్ళీ పార్టీ మారతారా ? కాంగ్రెస్ పై అలకబూనారా… అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక పార్టీలు మారుతున్నారు. దాంతో పాలిటిక్స్ లో ఆమె వ్యాల్యూ తగ్గుతోందన్న విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వస్తాయో లేదో అన్న ఆందోళన, పార్టీని వదిలి వెళ్ళిపోతున్న సీనియర్ నేతలు… ఇలా అనేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పై విజయశాంతి సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడంతో ఆ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాములమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా చూస్తున్నారు.