KESINENI TARGET : కేశినేని నాని టార్గెట్ చంద్ర బాబే..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని...స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న (Buddha Venkanna) టీంతో పొసగక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్‌లో విమర్శలు చేసిన నాని... చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

Vijayawada MP Keshineni Nani's target is former Chief Minister Chandrababu Naidu
విజయవాడ (Vijayawada) పార్లమెంట్ (Parliament) సభ్యుడు కేశినేని నాని(Keshineni Nani)… కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ(YCP)లో చేరినప్పటి నుంచి కేశినేని నాని టార్గెట్… చంద్రబాబు (Chandrababu Naidu) అయినట్లు స్పష్టమవుతోంది. వైసీపీలో చేరాక ఆయన చేస్తున్న కామెంట్లు చంద్రబాబు లక్ష్యంగానే ఉంటున్నాయి. టీడీపీ(TDP)లో ఏ నేతపైనా… పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని…స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న (Buddha Venkanna) టీంతో పొసగక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్‌లో విమర్శలు చేసిన నాని… చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. టిడిపిలో ఉన్నంత కాలం బుద్ధ వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా, నాగుల్ మీరా లాంటి ప్రత్యర్థివర్గం నేతలపై విరుచుకుపడ్డారు. అయితే పార్టీ మారిన దగ్గర నుంచి నాని వాయిస్ మారింది. ఇప్పటి వరకు తిట్టిన బుద్ధా వెంకన్నపై విమర్శలను దాదాపు తగ్గించేశారు.
- Rajya Sabha Election : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక..
కేశినేని నాని టార్గెట్… ఇప్పుడు కేవలం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అనేది ఆయన మాటలు ద్వారా అర్థమవుతోంది. నందిగామ, బెజవాడ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో… కేశినేని నాని చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు… అందుకే ఆయన సీట్లు అమ్ముకొని వచ్చిన డబ్బుతో మూటా ముల్లా సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడ ఎంపీగా తనపై పోటీ చేయాలనీ, చంద్రబాబుపై తాను మూడు లక్షలు మెజారిటీతో గెలుస్తానంటూ వరుస కామెంట్లతో చంద్రబాబుపై రెచ్చిపోతున్నారు.
AP Rajya Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ రచ్చ…
మరోవైపు చంద్రబాబుపై కేశినేని నాని చేస్తున్న కామెంట్లను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు టీడీపీ నేతలు. ప్రధానంగా బుద్ధా వెంకన్న…కేశినేని నాని చేసిన కామెంట్లలో ప్రతి దాని మీదా కౌంటర్ ఇస్తున్నారు. అయితే బుద్ధా వెంకన్న చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించడానికి మాత్రం కేశినేని నాని నిరాకరిస్తున్నారు. తనస్థాయి చంద్రబాబు స్థాయి అనీ… చంద్రబాబు కామెంట్ చేస్తేనే స్పందిస్తానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట కేశినేని నాని. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లాంటివి చేసే వాళ్ళు విమర్శలు చేస్తే… నేను స్పందించనంటూ… ఒకే ఒక్క మాటతో బుద్ధా టీంకు కౌంటర్ ఇచ్చారు.
ఇకపై చంద్రబాబు టార్గెట్ గానే తన విమర్శలు కొనసాగుతాయని… కేశినేని నాని స్పష్టం చేసినట్టు అర్దం అవుతోంది. చంద్రబాబు టార్గెట్‌గా కేశినేని నాని చేస్తున్న విమర్శలకు ఏదో రకంగా కౌంటర్ ఇవ్వాలని టీడీపీ నేతలందరూ నానిపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును ఉద్దేశించి నాని ఎలాంటి కామెంట్లు చేస్తారో ? వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు తిప్పికొడతారో వేచి చూడాలి.