Suryaputra Karna : బ్రేక్ పడిన బొమ్మకి మళ్ళీ టీజర్..? ( సూర్యపుత్ర కర్ణ )
సూర్యపుత్ర కర్ణ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు విక్రమ్ స్పందించలేదు. గ్లింప్స్ ని కూడా ట్విట్టర్ లో షేర్ చేయలేదు. అయితే షూటింగ్ పూర్తవ్వని సినిమాకి టీజర్ లాంచ్ చేయడం వెనుక దర్శకుడు ఆర్ఎస్ విమల్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. టీజర్ తో హైప్ పెంచిన అడ్వాన్స్ రూపంలో డబ్బులు చేసుకుందామని మేకర్స్ ప్లాన్ చేశారు మాట టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.

Vikram announced the Pan India movie Suryaputra Karna six years ago A part of the shooting has also been done Makers have shown some battle scenes
సినిమా ఓ కళాత్మక వ్యాపారం. ఇక్కడ కొబ్బరికాయ కట్టించుకున్న ప్రతి ప్రాజెక్ట్ గుమ్మడికాయ కొట్టించుకుంటున్న గ్యారెంటీ లేదు. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్ లో ఇరుక్కుపోయిన ఓ ప్రాజెక్ట్ నుంచి టీజర్ రిలీజ్ చేశాడు డైరెక్టర్. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరోకు చెప్పకుండా గ్లింప్స్ రిలీజ్ చేయడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది.
విక్రమ్ ఫ్యాన్స్ కు సర్పైజ్..
పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు చియాన్ విక్రమ్ (ఆదిత్య కరికాలన్) గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. తర్వాత పా.రంజిత్ డైరెక్షన్ లో తంగళన్ మూవీని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత విక్రమ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనేది సస్పెన్స్. అయితే సడన్ గా ‘సూర్యపుత్ర మహావీర్ కర్ణ’ టీజర్ రిలీజ్ చేసి చియాన్ ఫ్యాన్స్ ని సర్పైజ్ చేశాడు డైరెక్టర్ ఆర్.ఎస్.విమల్.
బాహుబలి 2 క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ కు.. మించిన యాక్షన్ సీన్స్
సూర్యపుత్ర కర్ణ అనే పాన్ ఇండియా మూవీకి ఆరేళ్ళ క్రితమే అనౌన్స్ చేశారు విక్రమ్. కొంత భాగం షూటింగ్ కూడా అయ్యింది. కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్. కానీ ప్రొడక్షన్లో విపరీతమైన జాప్యం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడింది. విక్రమ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ డైరెక్టర్ తాజాగా కర్ణ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. టీజర్ చూసిన విక్రమ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. బాహుబలి 2 క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ని మించి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ వారియర్ సినిమాని తెరకెక్కించాలన్న కసి ఈ టీజర్ లో కనిపిస్తోంది.
బ్రేక్ పడిన సినిమా నుంచి.. టీజర్ రిలీజ్..?
సూర్యపుత్ర కర్ణ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు విక్రమ్ స్పందించలేదు. గ్లింప్స్ ని కూడా ట్విట్టర్ లో షేర్ చేయలేదు. అయితే షూటింగ్ పూర్తవ్వని సినిమాకి టీజర్ లాంచ్ చేయడం వెనుక దర్శకుడు ఆర్ఎస్ విమల్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. టీజర్ తో హైప్ పెంచిన అడ్వాన్స్ రూపంలో డబ్బులు చేసుకుందామని మేకర్స్ ప్లాన్ చేశారు మాట కోలీవుడ్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే విక్రమ్ కి ఇలా జరగడం మొదటిసారి కాదు. గౌతమ్ మీనన్ తో ధృవ నచ్చతిరం చేస్తే ఐదేళ్ల తర్వాత కానీ మోక్షం దక్కలేదు. అంతకుముందు ఐ, ఇంకొక్కడు లాంటి ఎన్నో అవాంతరాలు దాటుకున్నవే. అయితే సూర్యపుత్ర కర్ణ ట్విస్ట్ మాత్రం విచిత్రంగా ఉంది. బ్రేక్ పడిన సినిమా నుంచి టీజర్ రావడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఉన్న అడ్డంకులు తొలగినట్లేనని..? త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది? అనే దాని పై విక్రమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.