VIKRAM GOUD: ఎంపీ ఎన్నికల ముందు బీజేపీకి షాక్‌లు.. తనతో పాటు వాళ్లను తీసుకెళ్తున్న విక్రమ్..
తెలంగాణ బీజేపీ నుంచి ఈ సీజన్‌లో ఫస్ట్ వికెట్ కూలింది. ఇది ఊహించిందే. ఐతే ఈయన తర్వాత ఎవరు క్యూ కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన విక్రమ్ గౌడ్.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు.
VIKRAM GOUD: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇలాంటి టైమ్‌లో.. జంపింగ్‌లతో కాషాయం పార్టీకి కషాయం మింగినట్లు అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్‌లు భారీగానే జరిగాయ్. ఇప్పుడు ఇదే సీజన్ ఏపీలో నడుస్తోంది. ఐతే తెలంగాణలో కూడా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మళ్లీ జంపింగ్ సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది.
KTR: దేశంలోనే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.. ఎప్పుడూ ప్రజల్ని లైన్‌లో నిలబెట్టలేదు: కేటీఆర్
తెలంగాణ బీజేపీ నుంచి ఈ సీజన్‌లో ఫస్ట్ వికెట్ కూలింది. ఇది ఊహించిందే. ఐతే ఈయన తర్వాత ఎవరు క్యూ కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన విక్రమ్ గౌడ్.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇటీవల ఇంచార్జీలను నియమించిన బీజేపీ.. తనకు మరోసారి ప్రాధాన్యం ఇవ్వలేదనేది విక్రమ్ గౌడ్ ఆవేదన. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్.. గోషామహల్ టికెట్ ఆశించారు. రాజాసింగ్‌పై బీజేపీలో బహిష్కరణ వేటు కొనసాగుతున్న సమయంలో ఆ సీటు తనకేనని ఆశపడ్డారు. ఐతే సస్పెన్షన్ ఎత్తివేసిన పార్టీ.. రాజాసింగ్‌ను దగ్గర చేసుకుంది. దీంతో విక్రమ్ గౌడ్‌కి అసెంబ్లీ సీటు దక్కలేదు. ఇటీవల లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటించినా.. విక్రమ్ గౌడ్‌కు అందులో స్థానం లేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.
ఐతే విక్రమ్‌గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యేలు సినీనటి జయసుధ సహా పలువురు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. తెలంగాణలో అధికారానికి దగ్గర కాలేకపోయినా సీట్లు, ఓట్లు పెంచుకుని బీజేపీ తన స్థానాన్ని కాస్త మెరుగుపరచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింత పుంజుకోవాలని చూస్తోంది. ఐతే అసంతృప్తుల రాజీనామాలు పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయ్.