బ్రేకింగ్: ఒక్క రాత్రిలో వినేష్ ఎంత బరువు తగ్గిందో తెలుసా…?
వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఒలంపిక్స్ లో ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయడం పట్ల ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేసారు.
వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఒలంపిక్స్ లో ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయడం పట్ల ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేసారు. ఆమెకు మద్దతుగా నిలవాలని, నిరసన తెలపాలంటూ ఆయన ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషాను కోరినట్లు సమాచారం. ఇక ఎక్స్ లో వినేష్ కు మద్దతుగా ఆయన పోస్ట్ పెట్టారు. ఈ సమయంలోనే నువ్వు మరింత బలంగా మారాలంటూ సూచించారు.
ఇక ఇదిలా ఉంచితే బరువు తగ్గడానికి రాత్రి అంతా కఠోర సాధన చేసిన వినేష్, అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. రాత్రికి రాత్రే ఆమె కేజీకి పైగా బరువు తగ్గారు. డీ హైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. నువ్వు చాంపియన్లకె చాంపియన్ అంటూ కొనియాడిన మోడీ, దేశం మొత్తం నీకు అండగా నిలుస్తుంది అంటూ పోస్ట్ చేసారు. ఇక ఆమెపై అనర్హత వేటు వేయడం పట్ల పార్లమెంట్ లో విపక్షాలు నిరసన తెలిపాయి. దీనిపై క్రీడా శాఖా మంత్రి వివరణ ఇస్తారంటూ ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో విపక్షాలు శాంతించినట్లు తెలుస్తోంది.