కోహ్లీ ఆధ్యాత్మిక యాత్ర, వైరల్ గా మారిన వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు భక్తి ఎక్కువే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు వెళ్తుంటారు.

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు భక్తి ఎక్కువే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు వెళ్తుంటారు. తాజాగా కోహ్లి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామ్ లో ఉన్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ దగ్గరికి వెళ్లారు. గతంలో జనవరి 2023లోనూ వీళ్లు ఆ గురువు ఆశీస్సులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆయన దగ్గరకు వెళ్లారు. స్వామీజికి కోహ్లి,అనుష్క సాష్టాంగ ప్రణామం చేసిన వీడియో వైరల్ గా మారింది. అయితే వీడియోను అభిమానులతో పంచుకున్నప్పటకీ మరోసారి తమ పిల్లల ముఖాలను మాత్రం రివీల్ చేయలేదు. కాగా కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.