యువపేసర్ కు సర్ ప్రైజ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉన్నా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం సరదాగా ఉంటాడు. జూనియర్లతో కలిసిపోతూ వారిని ప్రోత్సహిస్తాడు. ఒక్కోసారి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ యువక్రికెటర్లను సర్ ప్రైజ్ చేస్తుంటాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉన్నా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం సరదాగా ఉంటాడు. జూనియర్లతో కలిసిపోతూ వారిని ప్రోత్సహిస్తాడు. ఒక్కోసారి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ యువక్రికెటర్లను సర్ ప్రైజ్ చేస్తుంటాడు.తాజాగా యువపేసర్ ఆకాశ్ దీప్ కు కోహ్లీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తాను వాడే బ్యాట్‌ను యంగ్ పేసర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆకాశ్‌దీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ భయ్యా అంటూ కోహ్లీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో కోహ్లీ జూనియర్లతో ఎలా ఉంటాడో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యంగ్‌స్టర్స్‌ను టాప్ ప్లేయర్స్ ఇలా ఎంకరేజ్ చేయడం వారికి ఎంతో స్ఫూర్తినిస్తుందంటున్నారు.