గబ్బాలో ఇక విరాటపర్వమే, కోహ్లీ బ్యాక్‌ఫుట్‌ ప్రాక్టీస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాటపర్వం చూపిస్తాడనుకుంటే ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 07:29 PMLast Updated on: Dec 11, 2024 | 7:29 PM

Virat Kohli Has Started Practicing On The Backfoot

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాటపర్వం చూపిస్తాడనుకుంటే ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ ని ఆసీస్ బౌలర్లు చుట్టేశారు. అతని బ్యాట్ నుంచి పరుగులు రానివ్వకుండా కట్టడి చేశారు. దీంతో ఒత్తిడి ఆవరించింది. అయితే రెండో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించాడు. వాళ్ళ సహనాన్ని పరీక్షించిన కింగ్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లి టెస్టు కెరీర్‌లో ఇది 30వ సెంచరీ. అయితే రెండో టెస్టులో కోహ్లీ మళ్ళీ ఇబ్బంది పడ్డాడు.

అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తుంది. దీంతో ఇరు జట్లకు బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా తన బ్యాటింగ్ టెక్నిక్‌ మార్చేశాడు. తాజాగా ఓవల్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ వీడియోను చూసిన హర్భజన్ సింగ్ స్పందించాడు.

కోహ్లీ ఫ్రంట్-ఫుట్ ప్లేయర్. అయితే అది భారత పిచ్ లపై వర్కౌట్ అవుతుంది. కానీ ఆస్ట్రేలియాలో బౌన్స్‌ కారణంగా అక్కడ ఆడాలంటే బ్యాక్‌ఫుట్‌లో ఆడాలి. అది క్యాచ్ చేసిన విరాట్ కోహ్లీ బ్యాక్‌ఫుట్‌లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. గబ్బాలో పిచ్ చాలా భిన్నంగా ఉంటుందని కోహ్లీకి తెలుసని, అందుకే కోహ్లీ బ్యాక్‌ఫుట్‌లో ప్రాక్టీస్ చేశాడని చెప్పుకొచ్చాడు బజ్జీ. సో మూడో టెస్టులో కోహ్లీ చెలరేగడం ఖాయమని తెలుస్తుంది. మరోవైపు ఈ టెస్టులో రోహిత్ కూడా రాణించాల్సి ఉంది. తొలి టెస్టుకు దూరమైనా రోహిత్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ టెస్టులో రోహిత్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రెండంకెల స్కోరును నమోదు చేయలేదు. సో మొత్తానికి గబ్బా టెస్ట్ టీమిండియాకు సవాలుగా మారింది.