Virat Kohli Record: గూగుల్ చరిత్రలో కోహ్లీ టాప్… ఎక్కువ మంది వెతికారు !
ఇప్పటికే క్రికెట్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీకి ఇప్పుడు గూగుల్ చరిత్రలోనూ ఇంకో రికార్డు దక్కింది. కోహ్లీ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో ఈ రికార్డును బట్టి అర్థమవుతోంది. దీంతో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ బయటపడింది.
Virat Kohli Record in Google History: గూగుల్ సెర్చ్ హిస్టరీలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం దక్కింది. గూగుల్ 25యేళ్ళ హిస్టరీలో ఎక్కువ మంది వెతికి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచాడు. సచిన్, ధోనీ లాంటి క్రికెటర్లను కూడా అధిగమించాడు. పరుగుల వేటలో సచిన్ కూడా దాటుకుపోయిన విరాట్ కోహ్లీ… గూగుల్ లోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. కోహ్లీ గురించి తెలుసుకోడానికి అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆయన గురించిన ఏ అప్ డేట్ అయినా తెగ వెతుకుతున్నారు. గూగుల్ (Google) పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది వెతికిన క్రికెటర్‌గా విరాట్ టాప్‌లో నిలిచాడు.
ఈ ఏడాదితో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి 25 ఏళ్ళు పూర్తయ్యాయి. అందులో భాగంగా గూగుల్ ఎక్స్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో గడిచిన పాతికేళ్ళల్లో తమ సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువ మంది వెతికిన అంశాలతో వీడియోను తయారు చేసింది. ఈ వీడియోలో అత్యధిక మంది వెతికిన క్రికెటర్ (Most Searched Cricketer)గా కోహ్లీని చూపించింది.
Google Most Searches in India: గూగుల్ లో ఎక్కువ వెతికిన సమాచారం ఏదో తెలుసా ?
Most Searched Athlete గా క్రిస్టియానో రొనాల్డో
గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన అథ్లెట్‌గా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో టాప్ లో ఉన్నాడు. ఎక్కువ మంది వెతికిన మూవీ బ్యానర్‌గా బాలీవుడ్ నిలిచింది. చరిత్రలో అత్యంత ఎక్కువ మంది వెతికిన మొదటి అడుగుగా.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన చిత్రం నిలిచింది. 1980 గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారట.