కోహ్లీనా…మజాకా… అద్దం కాదు గోడ బద్దలైంది

సాధారణంగా బ్యాటర్లు సిక్సర్లు కొడితే స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ , వీఐపీ గ్యాలరీలో ఉండే అద్దాలు బద్దలవడం చూస్తూనే ఉంటాం... కానీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భారీ షాట్లతో అద్దం కాదు ఏకంగా గోడనే బ్రేక్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 08:05 PMLast Updated on: Sep 16, 2024 | 8:05 PM

Virat Kohli Serious At Practice Session

సాధారణంగా బ్యాటర్లు సిక్సర్లు కొడితే స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ , వీఐపీ గ్యాలరీలో ఉండే అద్దాలు బద్దలవడం చూస్తూనే ఉంటాం… కానీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భారీ షాట్లతో అద్దం కాదు ఏకంగా గోడనే బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ కోసం టీమిండియా ప్రస్తుతం ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. దాదాపు 8 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోహ్లీ ప్రాక్టీస్ లో దుమ్మురేపుతున్నాడు. కివీస్, ఆసీస్ తో సిరీస్ లకు ముందు ఫుల్ ఫామ్ అందుకోవాలనే లక్ష్యంతో నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు. రెగ్యులర్ గా టెస్ట్ ఫార్మాట్ అంటే స్లో అండ్ డిఫెన్సివ్ బ్యాటింగ్ నే చూస్తుంటాం. కానీ విరాట్ మాత్రం నెట్ ప్రాక్టీస్ లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు.

నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. టీ ట్వంటీ తరహా షాట్లతో ఫుల్లుగా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో భారత డ్రెస్సింగ్ రూమ్ దగ్గరలో గోడను బద్దలు కొట్టాడు. కోహ్లి కొట్టిన షాట్‌లలో ఒకటి డ్రెస్సింగ్ రూమ్‌కు సమీపంలో ఉన్న గోడను బ్రేక్ చేసింది. దీంతో సహచర ప్లేయర్లు షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు బంగ్లాకు ఇక దబిడిదిబిడేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో టెస్ట్ ఫార్మాట్ ఆడాడు.