ఎందుకిలా ఆడుతున్నావ్ ? కోహ్లీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. ఎప్పటిలానే తన బలహీనతకు వికెట్ పారేసుకున్నాడు. దీంతో విరాట్ పై విమర్శలు మొదలయ్యాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. ఎప్పటిలానే తన బలహీనతకు వికెట్ పారేసుకున్నాడు. దీంతో విరాట్ పై విమర్శలు మొదలయ్యాయి.మరోసారి తన బలహీతను బయటపెట్టిన కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. హ్యాజిల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ సిరీస్ లో కోహ్లీ ఇలా ఔట్ అవ్వడం ఇది నాలుగో సారి. తొలి టెస్ట్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ..పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్ లోనూ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడి వెనుదిరిగాడు.
ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో విరాట్ కు ఈ బలహీనత ఉంది. అతని మైనస్ పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. వినడానికి షాకింగ్ గా అనిపించినా కోహ్లీ ఇదే రీతిలో ఔట్ కావడం ఇది 51 వ సారి. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి.. దిగ్గజ హోదాలో ఉన్న విరాట్ తన బలహీనతను అధిగమించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. గబ్బాలోనూ ఇలాగే ఔట్ అవ్వడంతో మాజీ క్రికెటర్లు కోహ్లీ పై మండిపడుతున్నారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఈ ఆడ్పాటుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి బంతుల్ని ఆడాల్సిన అవసరమే లేదని, ఆ బంతి పూర్తిగా నాలుగో స్టంప్‌కి బయటికి వెళ్తోందన్నారు.
విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన బాధ్యత ఉన్నా ఇలాంటి పేలవ షాట్లు ఆడుతూ ఔట్ అవుతుండడం అసహనానికి గురి చేస్తుందన్నారు. ఇదిలా ఉంటే బ్యాటర్ల వీక్ నెస్ పై బ్యాటింగ్ కోచ్ దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ గణంకాలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది కోహ్లీ ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.