EVM-VVPAT : వీవీప్యాట్’ కేసు పిటిషన్ ను… సుప్రీం కోర్టు కొట్టివేత

ఈవీఎం, వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లు కొట్టివేత ఈవీఎంలు, వీవీప్యాట్ల (VVPAT) వెరిఫికేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. EVMలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వంద శాతం సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2024 | 12:08 PMLast Updated on: Apr 26, 2024 | 12:08 PM

Vvpat Case Supreme Court Dismissed The Petition

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిన్న మొదటి విడత ఎన్నికలు అయ్యి నెడు.. రెండో దశ ఎన్నికలు ప్రారంభం కొనసాగుతున్నాయి కూడా.. సుప్రీం కోర్టులో వేసిన కేసులో కీలక తీర్పునించింది దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు…

  • వీవీప్యాట్ స్లిప్ ల లెక్కింపు కుదరదు సుప్రీ కోర్టు..

ఈవీఎం, వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లు కొట్టివేత ఈవీఎంలు, వీవీప్యాట్ల (VVPAT) వెరిఫికేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. EVMలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వంద శాతం సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం లేదని పేర్కొంటూ రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించింది.

అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను EVM స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. బుధవారం (24-4-2024) విచారణ సందర్భంగా, బెంచ్ ఈవీఎంల గురించి, ముఖ్యంగా వాటి మైక్రోకంట్రోలర్‌ ల రీప్రొగ్రామబిలిటీకి సంబంధించి నిర్దిష్ట సాంకేతిక ప్రశ్నలను లేవనెత్తింది.

దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ, ఈవీఎంలలోని మైక్రోకంట్రోలర్‌లు వన్-టైమ్ ప్రోగ్రామబుల్ అని, వాటిని తయారు చేసిన తర్వాత మార్చలేమని స్పష్టం చేసింది. భద్రతా చర్యల పరంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ పేర్కొంది. CU, BU / VVPAT యూనిట్‌లు ఒక్కొక్కటి వాటి స్వంత మైక్రోకంట్రోలర్‌లను కలిగి ఉంటాయి. సురక్షితంగా లోపల భద్రపరచతాయని ECI తెలిపింది.

  • VVPAT తొలి ప్రయోగం.. 

కాగా 2014లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన VVPAT సిస్టమ్ ఆ సంవత్సరం సాధారణ ఎన్నికలలో తొలి సారి వినియోగించారు. ఈ వ్యవస్థ 2017 గోవా అసెంబ్లీ ఎన్నికలలో విస్తృతంగా ఉపయోగించబడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో VVPAT-EVM కాంబో తోనే ఎన్నికలు నిర్వహించారు.

SSM