వార్నర్ కు రిలీఫ్ కెప్టెన్సీపై బ్యాన్ ఎత్తివేత
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్షతో ఆరున్నరేళ్ల కాలం తర్వాత సారథి బాధ్యతల నిషేధం నుంచి వార్నర్ విముక్తి పొందాడు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్షతో ఆరున్నరేళ్ల కాలం తర్వాత సారథి బాధ్యతల నిషేధం నుంచి వార్నర్ విముక్తి పొందాడు. 2018లో కేప్‌టౌన్ టెస్టులో సాండ్ పేపర్ సంఘటనతో వార్నర్ ఏడాది పాటు ఆటకు, జీవితకాలం కెప్టెన్సీకి నిషేధానికి గురయ్యాడు. అయితే 2022లో ప్రవర్తనా నియమావళిలో మార్పులకు అనుగుణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురు అధికారులతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్యానెల్‌లోని ముగ్గురూ వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ నిర్ణయంతో బిగ్‌బాష్ లీగ్‌తో డేవిడ్ వార్నర్ తిరిగి సడ్నీ థండర్స్‌కు సారథి బాధ్యతలు అందుకునే అవకాశం దక్కింది.