Michoung  Cyclone : ఆంధ్రప్రదేశ్ కు మిచౌంగ్ తుఫాన్ హెచ్చరిక.. రెండు మూడు రోజులు భారీ వర్షాలు..

ఇక సముద్ర తీరం వెంబడి.. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశంముందని.. ఈ నెల 4న సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 11:17 AMLast Updated on: Dec 02, 2023 | 11:17 AM

Warning For Andhra Pradesh Heavy Rains For Two To Three Days

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న తుఫాన్.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం మచిలీపట్నానికి 910 కిలో మీటర్ల, నెల్లూరు జిల్లాకు 860 కిలోమీటర్ల, దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాక తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్నొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శం.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని, తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

ఇక సముద్ర తీరం వెంబడి.. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశంముందని.. ఈ నెల 4న సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా. తుఫాన్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పగోదావరి జిల్లాలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు వర్షపాతం భారీగా నమోదు అయ్యే అవకాశం ఉంది. కలెక్టరేట్, డివిజన్, మండల పరిధిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. రాజమండ్రి కలెక్టరేట్ లో 8977935609, రాజమండ్రి ఆర్డీవో 0883-2442344, కొవ్వూరు 08813231488 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.