రోహిత్ తో అగార్కర్ భేటీ, రిటైర్మెంట్ గురించేనా ?

వరల్డ్ క్రికెట్ లో ఎలాంటి ఆటగాడికైనా ఒక్కోసారి బ్యాడ్ టైమ్ నడుస్తుంది... అప్పటి పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఫామ్ అందుకుంటే కెరీర్ ముందుకెళుతుంది... లేకుంటే అన్ని విధాలుగా ఆలోచించి రిటైర్మెంట్ ప్రకటించేస్తుంటారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 09:18 PMLast Updated on: Dec 27, 2024 | 9:18 PM

Was Agarkars Meeting With Rohit About Retirement

వరల్డ్ క్రికెట్ లో ఎలాంటి ఆటగాడికైనా ఒక్కోసారి బ్యాడ్ టైమ్ నడుస్తుంది… అప్పటి పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఫామ్ అందుకుంటే కెరీర్ ముందుకెళుతుంది… లేకుంటే అన్ని విధాలుగా ఆలోచించి రిటైర్మెంట్ ప్రకటించేస్తుంటారు… ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే పరిస్థితి… ఏడాదికి పైగా టెస్ట్ క్రికెట్ లో అత్యంత పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఆసీస్ టూర్ లోనూ తన ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులోనూ నిరాశపరిచాడు. మిడిలార్డర్ నుంచి మళ్ళీ ఓపెనర్ గా రీఎంట్రీ ఇచ్చినా ఫామ్ అందుకోలేకపోయాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా రోహిత్ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. అనవసర షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఆట అంటూ నిలదీస్తున్నారు. రోహిత గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవంగా ఆడుతున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగుతున్నాడు.

ఫలితంగా రోహిత్ రిటైర్మెంట్ పై మళ్ళీ చర్చ మొదలైంది. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ తో హిట్ మ్యాన్ టెస్టులకు గుడ్ బై చెప్పేస్తాడన్నది లేటెస్ట్ వార్త… దీనికి సంబంధించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం రోహిత్ తో మాట్లాడినట్టు సమాచారం. పీటీఐ వార్తా కథనం ప్రకారం మెల్ బోర్న్ లోనే ఉన్న అగార్కర్ రోహిత్ తో భేటీ అయ్యాడని, సిడ్నీ టెస్ట్ తర్వాత అతని టెస్ట్ కెరీర్ పై మాట్లాడాడన్న తెలుస్తోంది. అతను ఈ సిరీస్ లో 4 ఇన్నింగ్స్ ల్లో 3, 6, 10, 3 పరుగులే చేశాడు. గత సిరీస్ ల్లో కూడా అంతగా ఆడలేదు. రోహిత్ శర్మ చివరి 14 ఇన్నింగ్స్‌లలో ఒక్క ఫిఫ్టీ మాత్రమే చేయగా.. ఒక్కసారి మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. 14 ఇన్నింగ్స్ ల్లో 11.07 సగటుతో కేవలం 155 పరుగులే చేశాడు. 37 ఏళ్ల వయసున్న రోహిత్ ఆడడం, పరుగెత్తడంలో ఇబ్బంది పడుతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు.

రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఐదో టెస్ట్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సిడ్నీలో జనవరి 3 నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ ఆసీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ గెలవకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు దాదాపుగా గల్లంతయినట్టే… అదే జరిగితే రోహిత్ ను టెస్ట్ ఫార్మాట్ లో చూడడం ఇదే చివరిసారి కావొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత జూలై వరకూ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా లేదు. దీంతో ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.