కెప్టెన్ ను తప్పించారా ? రోహిత్, గంభీర్ మధ్య హైడ్రామా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో చివరి టెస్ట్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 185 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించే అవకాశం కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 05:12 PMLast Updated on: Jan 03, 2025 | 5:12 PM

Was The Captain Removed High Drama Between Rohit And Gambhir

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో చివరి టెస్ట్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 185 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించే అవకాశం కనిపించడం లేదు. బ్యాటర్లు అదనపు బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్‌ను తట్టుకోలేకపోతున్నారు. ఇక కెప్టెన్సీపై విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్ కూడా చివరిదశకు చేరుకుంది.

రోహిత్‌ని సిడ్నీ టెస్టు నుంచి తప్పించడం ద్వారా, పేలవ ఫామ్ కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తొలి కెప్టెన్‌గా అవతరించాడు. రోహిత్ మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాలు కెరీర్ ఫామ్ లో ఉండగానే టెస్టులకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలు తీసుకోవడంతో రోహిత్ టెస్ట్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిందనే చెప్పాలి. నిజానికి రోహిత్ ని టెస్ట్ నుంచి తప్పించడానికి పెద్ద డ్రామానే నడిచింది. గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కెప్టెన్, కోచ్ మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా గంభీర్, బుమ్రా కలిసి పిచ్ చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పిచ్‌ వద్దకు వెళ్ళాడు. కానీ గంభీర్ మరియు రోహిత్ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత గంభీర్, బుమ్రా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో చాలా సేపు కూర్చుని మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. అప్పుడు రోహిత్ మరియు మిగిలిన జట్టు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. దీని తర్వాత రోహిత్, అగార్కర్ మరియు బుమ్రా తమలో తాము మాట్లాడుకోవడం కనిపించింది. తర్వాత అందరూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. రోహిత్ మరియు బుమ్రా ప్రాక్టీస్ చేయలేదు. ఆ సమయంలో ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు.

ప్రాక్టీస్ చివరిలో బుమ్రా నెట్‌కి వచ్చాడు. ఐదు నిమిషాల తర్వాత రోహిత్ కూడా వచ్చాడు. ఈ సమయంలో నితీష్‌రెడ్డి బ్యాటింగ్‌ చేస్తుండగా గంభీర్ గమనిస్తున్నాడు. అప్పుడు రోహిత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ గంభీర్, రోహిత్ మాట్లాడుకోలేదు. దీంతో రోహిత్, గంభీర్ మధ్య అసలు మాటలే లేవని స్పష్టమైంది. అయితే రోహిత్ ని టెస్టుల నుంచి తొలగించాలని కోచ్ గంభీర్ ముందే డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.