అదిరిందయ్యా సుందర్ నమ్మకాన్ని నిలబెట్టావ్
బెంగళూరు టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకుంది. స్పిన్ తోనే కివీస్ జోరుకు చెక్ పెట్టాలని నిర్ణయించుకోవడం.. దాని కోసం టర్నింగ్ పిచ్ నే రెడీ చేసుకుంది. పుణేలో పిచ్ కు తగ్గట్టుగానే తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్న భారత్ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది.
బెంగళూరు టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకుంది. స్పిన్ తోనే కివీస్ జోరుకు చెక్ పెట్టాలని నిర్ణయించుకోవడం.. దాని కోసం టర్నింగ్ పిచ్ నే రెడీ చేసుకుంది. పుణేలో పిచ్ కు తగ్గట్టుగానే తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్న భారత్ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది. గంటల వ్యవధిలో తుది జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అది కూడా ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శనతో అదరగొట్టేశాడు. స్పిన్నర్ల నుంచి జట్టు కెప్టెన్ ఎలాంటి బంతులు కోరుకుంటాడో వాటిని ఎగ్జాట్ గా దింపేశాడు. అసలు సుందర్ స్పిన్ కు కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతని బంతులకు కివీస్ బ్యాటర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా రవీంద్ర, బ్లండెల్‌ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.
తొలి స్పెల్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుందర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ 59 ఓవర్ల తర్వాత ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్ రవీంద్రను ఔట్ చేసి రోహిత్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. మిడిల్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని రచిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ మిడిల్ ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. మరోవైపు బ్లండెల్‌ను కూడా సుందర్ ఈ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. కనీసం బంతిని టచ్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకపోగా…రెండు బంతులూ బ్యాట్ పక్క నుంచి వెళ్లి వికెట్లని పడగొట్టాయి.
ఓవరాల్ గా 7 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ సుందర్ కు తన టెస్ట్ కెరీర్ లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. 2021 తర్వాత గాయం, ఫిట్‌నెస్ సమస్యలతో టెస్టులకి దూరంగా ఉండిపోయిన వాషింగ్టన్ సుందర్.. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించాడు. దాంతో బెంగళూరు టెస్టులో భారత్ జట్టు ఓడిపోగానే సడన్‌గా వాషింగ్టన్ సుందర్‌కి భారత్ జట్టు నుంచి పిలుపు వెళ్లింది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకి తప్పించి మరీ ఎంతో నమ్మకంతో వాషింగ్టన్ సుందర్‌కి తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చోటిచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కివీస్ బ్యాటర్లు చుక్కలు చూపించాడు. వాషింగ్టన్ సుందర్ చివరిగా 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు కేవలం 5 టెస్టులే ఆడిన సుందర్ 337 పరుగులతో పాటు 9 వికెట్లు కూడా పడగొట్టాడు.