ఆడపిల్లకు.. ఇన్ని కష్టాలా.. దేవుడు నిజంగా దుర్మార్గుడే..

విధి ఆడే వింత నాటకాలు అన్నీ ఇన్నీ కావు. సాఫీగా సాగిపోయే జీవితం.. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషాదానికి దారి తీస్తుందో ఊహించడం కూడా కష్టమే. అందరూ దూరం అయి.. పుట్టెడు కన్నీటిని కడుపులో దాచుకొని.. ఏదోలా బతుకుదాం అనుకుంటే.. ఆ దేవుడికి ఇంకా ఆశ తీరలేదు అనుకుంటా.. అనుకోని విషాదాన్ని తీసుకొచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 09:00 PMLast Updated on: Sep 12, 2024 | 9:00 PM

Wayanad Victim Facing Another Issue

విధి ఆడే వింత నాటకాలు అన్నీ ఇన్నీ కావు. సాఫీగా సాగిపోయే జీవితం.. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషాదానికి దారి తీస్తుందో ఊహించడం కూడా కష్టమే. అందరూ దూరం అయి.. పుట్టెడు కన్నీటిని కడుపులో దాచుకొని.. ఏదోలా బతుకుదాం అనుకుంటే.. ఆ దేవుడికి ఇంకా ఆశ తీరలేదు అనుకుంటా.. అనుకోని విషాదాన్ని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి స్టోరీ తెలిస్తే.. ఎలాంటి వారి మనసు అయినా కదలడం ఖాయం. వయనాడ్ వరదలకు అమ్మానాన్నలతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి.. తీరని శోకంలో ఉంది తను. గుండె రాయి చేసుకొని.. ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతోంది.

ఇలాంటి సమయంలో మరో ఊహించని విషాదం. తనకి కాబోయే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ యువతి బాధను వర్ణించడానికి మాటలు రాని పరిస్థితి ఎదురైంది. కేరళలోని వయనాడ్‌ జిల్లా చూరాల్‌మల గ్రామానికి చెందిన 24ఏళ్ల శృతికి… తన చిన్ననాటి స్నేహితుడు జెన్సన్‌‌తో జూన్‌ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మతాలు వేరైనా వారి ప్రేమకు కుటుంబ పెద్దలు అంగీకారం తెలిపారు. ఐతే జూన్‌ 30న శృతి జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి విధ్వంసం, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. అన్నీ కోల్పోయిన అనాథలా మారిన శృతికి.. జెన్సన్‌ తోడుగా నిలిచాడు.

తన జాబ్ మానేసి మరీ.. కష్టకాలంలో ఆమె వెంటే నిలిచాడు. ప్రకృతి ప్రకోపానికి బలైన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు.. శ్మశానవాటికకు చేరుకొని.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలుస్తామని సమాధుల మధ్యే ఈ జంట ప్రమాణం చేశారు. సెప్టెంబర్‌లో తాము రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఐతే ఆమెకు జాన్సన్‌తో కలిసి బతికే అవకాశం కూడా ఇవ్వలేదా దేవుడు. జాన్సన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో శృతి జీవితం చీకటిగా మారిపోయింది.