Film Industry : మీకు దమ్ముంటే ఆ ప్రశ్న హీరోలను అడగండి…
సినిమా పరిశ్రమ (Film Industry) లో హీరోలకు ఉన్న విలువ హీరోయిన్లకు ఉండదు అనే ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. అగ్ర హీరోలకు ఒక గుర్తింపు, హీరోయిన్లకు మరో గుర్తింపు ఉంటుంది.

We keep hearing accusations that heroines do not have the same value as heroes in the film industry.
సినిమా పరిశ్రమ (Film Industry) లో హీరోలకు ఉన్న విలువ హీరోయిన్లకు ఉండదు అనే ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. అగ్ర హీరోలకు ఒక గుర్తింపు, హీరోయిన్లకు మరో గుర్తింపు ఉంటుంది. హీరోకి గొప్ప స్టార్ ఇమేజ్ లేకపోయినా సరే అతనికి ఉండే ప్రాధాన్యత వేరు. ఇక జర్నలిస్ట్ లు కూడా కొన్ని ప్రశ్నలు అడిగే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో ఒక్క మాట కూడా అడిగే సాహసం చేయలేరు అనే మాట వాస్తవం. స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో భారీగా రెమ్యునరేషన్ (Remuneration) డిమాండ్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ (Big Budget) సినిమా అయినా కాకపోయినా సరే డిమాండ్ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. తమకు ఇంత ఫాలోయింగ్ ఉందని మీకు ఇన్ని లాభాలు వస్తాయని అవసరమైతే… తమకు లాభాల్లో వాటా కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు. మన తెలుగులో యువ హీరోలు కూడా ఇప్పుడు భారీగా డిమాండ్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇదిలా ఉంచితే దీనిపై మాజీ హీరోయిన్ టబు కీలక వ్యాఖ్యలు చేసింది. అజయ్ దేవగన్ తో కలిసి ఆమె ఔర్ మే కహా దమ్ థా అనే ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ (Bollywood) నటుల రెమ్యునరేషన్ గురించి ప్రశ్న రాగా… ఈ ప్రశ్న తరచూ నటీమణులనే ఎందుకు అడుగుతుంటారు అంటూ ఫైర్ అయిపొయింది టబు. ఇదే ప్రశ్న నిర్మాతలను కూడా అడగొచ్చు కదా అంటూ జర్నలిస్ట్ (Journalist) లను ఎదురు ప్రశ్నించింది టబు. అలాగే, మీకెందుకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని హీరోలను అడగవచ్చు కదా అని మరో ఘాటు ప్రశ్న వేసింది. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఈ విషయంలో ఎన్నో మార్పులు వస్తాయని అంది టబు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోల డిమాండ్ దెబ్బకు నిర్మాతలు రోడ్డున పడుతున్నారు అనే ఆరోపణలు వినపడుతున్న సంగతి తెలిసిందే.