చివరి టీ20కి వారిద్దరిపై వేటు ? భారత తుది జట్టు ఇదే

సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా చివరి మ్యాచ్ కు రెడీ అయింది. శుక్రవారం జోహెనస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. మూడో టీ ట్వంటీలో గెలిచిన భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 05:43 PMLast Updated on: Nov 14, 2024 | 5:43 PM

What About Both Of Them For The Last T20 This Is The Final Indian Team

సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా చివరి మ్యాచ్ కు రెడీ అయింది. శుక్రవారం జోహెనస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. మూడో టీ ట్వంటీలో గెలిచిన భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ చివరి పోరుకు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చాలని లేకపోయినా, సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఫినిషర్ రింకూ సింగ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ గత మూడు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో రింకూను డ్రాప్ చేసి అతని స్థానంలో జితేశ్ శర్మను తుదిజట్టులోకి తీసుకునే ఛాన్సుంది.

మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో మార్పులు జరిగే అవకాశం లేదు. మొదటి రెండు టీ ట్వంటీల్లో ఫెయిలైన అభిషేక్ శర్మ సెంచూరియన్ లో మాత్రం హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. అయితే తొలి టీ ట్వంటీలో శతక్కొట్టిన సంజూ శాంసన్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ అవ్వడం నిరాశపరిచింది. దీంతో ఫ్యాన్స్ సంజూ నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపుల కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను తప్పించే అవకాశాలున్నాయి. బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్న హార్థిక్ బంతితో మాత్రం ఫ్లాప్ అవుతున్నాడు. మూడో టీ ట్వంటీలో తన 4 ఓవర్ల స్పెల్ లో పాండ్యా ఏకంగా 50 రన్స్ ఇచ్చేశాడు. రొటేషన్ లో హార్థిక్ కు రెస్ట్ ఇచ్చి యశ్ దయాల్ లేదా విజయ్ వైశాక్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమణ్ దీప్ సింగ్ అరంగేట్రం చేయగా… విజయ్ వైశాక్ కు కూడా డెబ్యూ ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు.

అయితే అర్షదీప్ సింగ్ కూడా లెఫ్టార్మ్ బౌలరే. ఈ నేపథ్యంలో అర్షదీప్ సింగ్‌కు కూడా విశ్రాంతి ఇచ్చి అవేశ్ ఖాన్ తీసుకుంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సిరీస్ గెలిచే ఛాన్స్ ఉండడంతో అర్షదీప్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువ, ఎందుకంటే పవర్ ప్లేలోనూ, డెత్ ఓవర్లలోనూ అర్షదీప్ ఖచ్చితంగా భారత్ కు అడ్వాంటేజ్. ఇది మూడో టీ ట్వంటీలోనూ ప్రూవ్ అయింది. చివర్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా… హాఫ్ సెంచరీ కొట్టిన మార్కో జెన్సన్ ఔట్ చేసి మ్యాచ్ ను గెలిపించాడు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాండరర్స్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరించే ఛాన్సుంది.