ఇజ్రాయెల్- పాలస్తీన్ల పరస్పర దాడుల వెనుక ఉన్న కారణాలు ఏంటి.. ఎన్నేళ్లుగా ఈ యుద్దం జరుగుతోంది..?

ఇజ్రాయెల్, పాలస్తీన్ల తీవ్రమైన బాంబుల దాడుల వెనుకు ఉన్న అసలు కథేంటి. వారి సమస్యలు ఏంటి.. ఇలాంటి దాడులు ఎన్నేళ్ళ నుంచి జరుగుతున్నాయో ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 11:26 AMLast Updated on: Oct 08, 2023 | 11:26 AM

What Are The Reasons Behind The Israeli Palestinian War

ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ దాదాపు మూడు దశాబ్దాల నుంచే మొదలైంది. ప్రస్తుతం పరిస్థితి చేదాటిపోయి రావణకాష్టంగా మరింది. సాధారణంగా పాలస్తీనా ఆసియాలోని మధ్యధరా సముద్రానికి జోర్థాన్ నదికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ యూదులు, క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. చరిత్రలోకి వెళ్లి చూసినట్లయితే ఈజిప్ట్ రాజులు, పర్షియన్ చక్రవర్తులు, అలెగ్జాండర్, ఆటమన్ దేశాధినేతలు దీనిని పాలించారు. ఈ ప్రాంతమంతా ఒటోమాన్ అనే సామ్రాజ్యంగా ఉన్న తరుణంలో అప్పట్లో ఈ దేశాధిపతి ఓటమి పాలవ్వడంతో బిట్రన్ దీనిని హస్తగతం చేసుకుంది. ఇదంతా 1914 కాలం నాటి మాట. అయితే ఎప్పుడైతే ఒటోమాన్ ఓడిపోయారో యూదులు, క్రైస్తవులు పాలస్తీనాను తమ సొంత ప్రాంతంగా భావించారు. దీనికి అధికసంఖ్యలో ఉన్న అరబులు ససేమీరా అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది.

బ్రిటన్ జోక్యం..

ఈ సమయంలో లీగ్ ఆఫ్ నేషన్ అనే పేరుతో బ్రిటన్ 1920 నుంచి 1948 వరకు పాలస్తీనాను పాలించింది. సీన్ కట్ చేస్తే రెండవ ప్రపంచ యుద్దంలో ఐరోపా దేశాలైన జర్మనీతో పాటూ ఇతర దేశాలపై తరచూ దాడులు జరుగుతూ ఉండేవి. దీంతో ఆప్రాంతాల్లోని యూదులు పాలస్తీనాలోకి వలస వచ్చి స్థిరపడ్డారు. దీంతో ఒక్కసారిగా యూదులు సంఖ్యతో పాటూ తమకు పాలస్తీనాను ఇచ్చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఇక్కడి నుంచి యుద్దం మరింత అగ్గిరాజుకుంది. ఈ గొడవలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని జెరుసెలేం ను స్థిరంగా ఉంచి పాలస్తీనాను యూదు, అరబ్ దేశంగా విభజించాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పాలస్తీన్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఎవరూ పరిష్కరించలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రదాన సమస్యలు ఇవే..

  1. ఇజ్రాయెల్ ఒక దేశంగా విరాజిల్లుతోంది. ఇదే తరహాలో పాలస్తీనాను దేశంగా ప్రకటించాలా వద్దా అనే సందేహం..?
  2. వెస్ట్ బ్యాంక్ లో ఆవాసాలుగా మారిన యూదుల నివాసాను ఉంచాలా.. తొలగించాలా..?
  3. పాలస్తీనాకు వలస వచ్చిన శరణార్థుల పరిస్థితి ఏంటి.. ఎక్కడకి తరలించాలి..?
  4. జెరుసలేంను ఇరు పక్షాలకు సమానంగా పంచాలా.. లేక ఒకరే ఆధిపత్యం కొనసాగిస్తారా..?
    ఈ నాలుగు సమస్యలు దాదాపు మూడు దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవే నేటి యుద్ద తీవ్రతకు కారణంగా చెప్పాలి.

What are the reasons behind the Israeli-Palestinian war

రెండు దశాబ్ధాలుగా కొనసాగిన సంఘర్షణల్లో ముఖ్య ఘట్టాలు..

  • 2006లో పాలస్తీనా చట్టసభల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న హమాస్ ల అధికారం లభించింది. అయితే దీనిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్ కీలక పాత్రపోషించాయి. ఇజ్రాయిల్ పై హింసను విడిచిపెట్టమని అడిగినప్పటికీ హమాస్ నాయకులు నిరాకరించారు. దీంతో పాలించేందుకు అవసరమైన నిధులను, ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి అమెరికా, ఇజ్రాయెల్ లు.
  • 2007లో ఇజ్రాయెల్ లో ప్రదాన భాగంగా ఉండే గజాను హమాస్ లు ఆక్రమించుకున్నారు. ఇలా చేసే క్రమంలో తీవ్రమైన వ్యతిరేకతలు, దాడులు జరిగాయి.
  • 2008లో ఇజ్రాయిల్ పై హమాస్ లు తీవ్రమైన రాకెట్ దాడులను చేయడం ప్రారంభించారు. దీంతో ఇజ్రాయెల్ దీనిని తిప్పి కొట్టే ప్రయత్నంలో పెద్ద యుద్దాన్ని చేయాల్సి వచ్చింది. ఈ యుద్దం లో 13మంది ఇజ్రాయెల్ ప్రాంతీయులు మరణించారు. ఈ 22 రోజుల యుద్దంలో చివరగా ఒక ఒప్పందానికి వచ్చారు పాలస్తీన్లు. ఈ లోగా 1400 మంది పౌరులు ప్రాణాలు విడిచారు.
  • 2012లో ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకేసి హమాస్ సైన్యాధ్యక్షుడు అహ్మద్ జబారీని చంపేసింది. దీంతో హమాస్ తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. దాదాపు ఎనిమిది రోజుల పాటూ ఆకాశంలో బాంబులు విసురుతూ పర్సరం భీకరదాడులు చేసుకున్నాయి.
  • 2018లో గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఒక కంచెను ఏర్పాటు చేసింది. దీనికి పాలస్తీన్లు తీవ్ర అభ్యంతరం చెబుతూ నిరసనలు చేశారు. వారి నిరసనలు అడ్డుకునే క్రమంలో ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. దీంతో ఏడు నెలల పాటూ అవిశ్రాంతంగా యుద్దం సాగింది. ఇందులో దాదాపు 170 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
  • 2023లో హమాస్ లు ఏర్పాటు చేసుకున్న ఆయుధాల తయారీ కర్మాగారాలను గుర్తించింది ఇజ్రాయెల్. వాటిపై గగనతలం నుంచి అతిపెద్ద యుద్ద రాకెట్ ను ప్రవేశపెట్టింది. దీనిని నిలువరించే ప్రయత్నం చేశారు పాలస్తీన్లు. అయినప్పటికీ ఆయుధాలను తయారు చేసే ప్రాంతాల్లో ఏకధాటిగా విరుచుకు పడింది ఇజ్రాయెల్.
  • ఇదే ఏడాది మే నెలలోనూ ఇజ్రాయెల్, గజా తీవ్ర వాదుల మధ్య కాల్పులు జరిగాయి. దీనిని విరమించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇరు వర్గాలు. పరిస్థితులు సర్ధుమణిగేందుకు దాదాపు ఐదురోజులు పట్టింది.
  • ఇక తాజాగా సెప్టెంబర్ 26 నుంచి హమాస్ సైనిక స్థావరాలను గుర్తించింది ఇజ్రాయెల్. దీని కోసం ప్రత్యేకమైన డ్రోన్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్నారు పాలస్తీన్లు రోజూ తమదైన శైలిలో ప్రదర్శనలు చేస్తూ వచ్చారు. ఈ ప్రదర్శనలు శాంతి యుతంగా చేసినప్పటికీ యుద్ద పరిస్థితులు తప్పలేదు. దీంతో బాంబుల దాడులు జరిగి చాలా మంది చనిపోయారు.

పాలస్తీన్లు తమ రాజ్యాధికారంతో పాటూ ప్రాత్యేక గుర్తింపు కోసం గడిచిన రెండున్నర, మూడు దశాబ్ధాలుగా అలుపెరుగని పోరాటాన్ని చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్ర తరం చేశారని చెప్పేందుకు నిదర్శనమే హమాస్ వద్ద ఉన్న యుద్ద ఆయుధాలు ఒక కారణం.

T.V.SRIKAR