Supreme Court: ‘చంద్రబాబు అరెస్ట్ ఎప్పుడయ్యారు’ అని సీజేఐ అడగడం వెనుక ఆంతర్యమేమిటి..? సుప్రీంలో కేసు విచారణకు రాకపోవడానికి కారణాలు ఇవేనా..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఏసీబీ కోర్టు నుంచి హై కోర్టుకు వెళ్లింది. ఆతరవాత అక్కడ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకి గురవడంతో దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు చేరింది. దీనిపై తీర్పు కోసం యావత్ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అసలు కోర్టు విధి విధానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తులో వేగం పెంచింది. చంద్రబాబును జ్యూడిషియల్ కస్టడీ నుంచి రిమాండ్ కస్టడీ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి కౌంటర్ గా చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో బుధవారం విచారణకు రానుంది. అయితే అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు సహా క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సిద్దార్థ్ లూథ్రా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని మెన్షనింగ్లో ప్రవేశ పెట్టారు. అందుకే కేసు అంత త్వరగా విచారణకు రాలేదన్నది స్పష్టమౌతోంది.
మెన్షనింగ్ అంటే ఏమిటి..
గతంలో సీజేఐ గా చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసుల విచారణలో వేగం పెరిగింది. గతంలో వాయిదా పడ్డ కేసులను మెన్షనింగ్ లో ప్రవేశ పెట్టడం వల్ల సోమవారం నుంచి బుధవారం వరకూ విచారణ జరుగుతాయి. అంటే ఈ సమయంలో కొత్త కేసులు ఏవీ విచారణకు రావనమాట. కేవలం గతంలో రిజిస్టర్ అయిన కేసులను మాత్రమే బయటకు తీస్తారు. మరి మెన్షనింగ్ అంటే సోమవారం కౌౌంటర్ దాఖలు చేసినవి గురువారం తరువాత విచారణకు వస్తాయి. అందుకే వీటిని మెన్షనింగ్ అంటారు. అయితే సిద్దార్థ్ లూథ్రా సీనియర్ అడ్వకేట్ కావడంతో జస్టిస్ చంద్రచూడ్ రేపు విచారణకు తీసుకుందాం అన్నారు. దీని అర్థం పాత కేసులు విచారణ అయిపోయిన తరువాత కొత్త కేసులకు సంబంధించిన మెన్షనింగ్లో అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెన్షనింగ్ అంటే దాని అర్థం ఇప్పటికిప్పుడే తీర్పు వెలురిస్తారని కాదు. ఈ కేసు పూర్వాపత్రాలు సమర్పించండి దానిపై వాదనలు వింటాం అని అర్థం. అందుకే కుదిరితే మంగళ, బుధవారాల్లో విచారణ జరగాలి లేకుంటే సుదీర్ఘ సెలవుల తరువాత అక్టోబర్ 3 వరకూ దీని ప్రస్థావన ఉండదు అని చెప్పారు. అందుకే అక్టోబర్ 3 తరువాత మెన్షనింగ్ లో ఉంటుంది కనుక వారం ప్రదమార్థంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది.
సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి..
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో హైకోర్ట్ తాను జోక్యం చేసుకోలేనని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తించి క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీనిని వెంటనే విచారణ జరపాలని, తనపై ఉన్న ఆరోపణలను కొట్టివేయాలని ప్రదాన న్యాయమూర్తికి కోరారు సిద్దార్థ్ లూథ్రా. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీజేఐ చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ సెప్టెంబర్ 8న అని చెప్పారు లూథ్రా. దీంతో రేపు చూద్దాంలే ఈకేసును అని సీజేఐ అన్నారు. దీని వెనుకు ఉద్దేశ్యం ఏమిటంటే.. అరెస్ట్ తాజాగా ఏమైనా జరిగిందా.. అని అడగడమే. ఎందుకంటే ఎలాంటి కేసులో అయినా నిందితుడు అరెస్ట్ అయిన 24 గంటలలోపూ కోర్టుకు హాజరు పరచాలి అనే ఉద్ధేశ్యంతో ఈ ప్రశ్నను అడిగినట్లు ఇక్కడ మనం గమనించాలి. సిద్దార్థ్ లూథ్రా ఇచ్చిన సమాధానంతో దీనిని వారం ద్వితీయార్థంలో విచారణ చేపట్టవచ్చని న్యాయమూర్తికి ఈ కేసు తీవ్రత పై ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తుంది.
T.V.SRIKAR