Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బారిన పడ్డ 180 మంది.. అసలు ఈ వ్యాధి లక్షణాలేంటి.. ఎలా సోకుతుంది..?
ఈ నగరానికి ఏమైంది అనేది సినిమా టైటిల్. అయితే ఇప్పుడు ఈ దేశానికి ఏమైంది అన్న మాట లేవనెత్తాల్సి వస్తోంది. మన్నటి వరకూ భారత్ కోవిడ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నిన్న కేరళలో నిఫా వైరస్ తో భయాందోళనకు గురైంది. నేడు ఒడిశాలోని స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో అప్రమత్తమైంది. అసలు ఏంటి ఈ స్క్రబ్ టైఫస్ దీని ప్రభావం ఎలా ఉంటుందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరగడం కాస్త కలవరపెడుతోంది. ఆదివారం ఒక్క రోజే వ్యాధికి గురైన వారి సంఖ్య 180కి చేరుకుంది. ఇప్పటి వరకూ సేకరించిన 59 శాంపిల్స్ లో 11 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు దాదాపు 10 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సందరగఢ్, బర్గఢ్ జిల్లాల్లో ఈ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకూ ఏడుమంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
వ్యాధి ఎలా సోకుతుంది..
పల్లె ప్రాంతాల్లో, పచ్చని చెట్లు, పంట పొలాల్లో లార్వా అనే పురుగులు తిరుగుతూ ఉంటాయి. అవి కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందంటున్నారు వైద్య నిపుణులు. పట్టణాల్లో కంటే కూడా పొలాలు, అటవీ ప్రాంతాల్లో త్వరగా ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే ఎలుకలు మూత్ర విసర్జన చేసిన ప్రాంతాల్లో ప్రజలు జీవించడం ద్వారా కూడా వస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణం కారణంగా ఈ బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశం ఉంటుంది.
లక్షణాలు..
ఈ వ్యాధి కోవిడ్, డెంగ్యూ లాగానే పక్కవారికి వ్యాపిస్తుంది. ఇది ఒకరకమైన బ్యాక్టీరియా అంటున్నారు వైద్యులు. ఈ పురుగు కుట్టిన వెంటనే మంటగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా నల్లని/ఎర్రని మచ్చ ఏర్పడుతుంది. ఒక్కోసారి ప్రాధమిక దశలో గుర్తించడం కూడా చాలా కష్టం. దీర్ఘకాలిక/ స్వల్పకాలిక జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు, కామెర్లు వంటి లక్షణాలతో పాటూ కిడ్నీ ఫెల్యూర్, ఆర్గాన్స్ డ్యామేజ్ చేయవచ్చు. మరి కొందరిలో అయితే మయో కార్డియా అటాక్ అయి ఉన్న పళంగా చనిపోవచ్చు. ఊపిరితిత్తులు డ్యామేజ్ అయి ప్రాణాలు పోయే అస్కారం ఉంటుంది.
T.V.SRIKAR