Kalki 2898 AD : నాగి నీకేమైంది?…600 కోట్ల సినిమానా ఇది?
కల్కి 2898 AD సినిమా చూసి బావురు మనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే... మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూశారు.
కల్కి 2898 AD సినిమా చూసి బావురు మనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే… మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ను ఏదో చేద్దాం అనుకుని… ఇంకేదో చేసేసి… జనానికి అర్థం కాక., ఆయనకి అర్థం కాక సినిమాని కంపు చేసి వదిలేసాడు. కేవలం కల్కి 2898… పార్ట్ 2 కోసం పార్ట్ వన్ తీసినట్లుగా ఉంది. ఈ సినిమా కోసం అశ్వినీ దత్ ఆస్తులమ్మి 600 కోట్లు ఎందుకు పెట్టాడా అని అనిపించక మానదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే చివరికి ఇలాగే అవుద్దేమో అని జనం తిట్టుకుంటూ థియేటర్లో నుంచి బయటకు వస్తున్నారు.
కల్కి 2898 షూటింగు రోజు నుంచి జనంలో ప్రమోషన్ జరుగుతూనే ఉంది. పబ్లిక్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలే ప్రభాస్… అతనికి తోడు దీపికా పదుకొనే, అమితాబచ్చన్… వీరందరితోపాటు సూపర్ గ్రాఫిక్స్… కనుక కచ్చితంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో కల్కి 28 98 ఒక అద్భుతమే సృష్టించవచ్చని అందరూ భావించరు. కానీ డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రేక్ఛకుల ఎక్స్పెక్టేషన్స్ పై బిందెడు నీళ్లు కుమ్మరించాడు. అసలు సినిమా ఎందుకు తీసాడో… ఏం చెప్పాలనుకున్నాడు ఎవ్వరికి అర్థం కాలేదు. కల్కి మూవీ లో అతి పెద్ద లోపం కథ, స్క్రీన్ ప్లే. సినిమా అయిపోయే చివరి నిమిషం వరకు కథ ఏమిటో… స్క్రీన్ ప్లే ఏమిటో ఎవ్వరికి అర్థం కాదు. కల్కి పార్ట్ 2 కోసం కల్కి పార్ట్ వన్ భరించాలి మీరు అన్న ధోరణి లో సినిమా మొత్తం నడిచింది. మహాభారత యుద్ధానికి… ప్రస్తుతానికి లింకు పెట్టి రాడ్లు దించాడు డైరెక్టర్. మహాభారత యుద్ధంలో కృష్ణుడు అశ్వద్ధామకు శాపం ఇస్తాడు.
అశ్వద్ధామకు మరణం ఉండదు. మళ్లీ కృష్ణుడు పుట్టి అశ్వద్ధామ కు విముక్తి కలిగించేంతవరకు అశ్వద్ధామ బతికే ఉంటాడు. అలా నిరంతరం బతికుండే ఈ పాత్రకు అమితాబచ్చన్ ను తీసుకొచ్చాడు నాగ అశ్విన్. హీరో భైరవను కాశీని రక్షించే మహా శక్తిగా పరిచయం చేస్తాడు డైరెక్టర్. అంతకుమించి సినిమాలో ఇంకేమీ అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాక్టర్స్ మాత్రమే కాదు కొందరు నేషనల్ స్టార్స్ కూడా కల్కి 2898 లో కనిపిస్తారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపిస్తాడు, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, బ్రహ్మానందం ఒకరేమిటి కావలసినంత స్టార్ కాస్ట్ మొత్తం కల్కి లోనే ఉంది. బహుశా మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగా వీళ్ళందర్నీ మూవీలోకి ఎక్కించేసినట్టున్నారు. కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా దారుణం. డబ్బింగ్ అసలే మాత్రం సింక్ అవ్వలేదు. కథని నడిపించడంలో ఎక్స్పర్ట్ గా పేరున్న నాగ్ అశ్విన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడో అర్థం కాదు. అయితే కెమెరా, సిజి, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం ఇరగదీసేశాడు డైరెక్టర్ .
తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయాడు. అసలు VFXతో ఆడుకున్నాడు. హాలీవుడ్ సినిమాలు కూడా కొన్నిచోట్ల పనికిరావు అనిపించాడు. స్టార్ వార్స్ లాంటి వరల్డ్ వైడ్ మూవీస్ నీ దాటి వి ఎఫ్ ఎక్స్ తో అలరించాడు. బహుశా 600 కోట్ల రూపాయల్లో 300 కోట్లు గ్రాఫిక్స్ వర్క్ చేసినట్లు ఉన్నాడు. బాహుబలి వన్ టూ చూసినప్పుడు మనకి సిజి వర్క్, వి ఎఫ్ ఎక్స్ ఫెయిల్యూర్స్ బాగా కనిపిస్తాయి. ఆ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ బాహుబలి కన్నా బెటర్ గా గ్రాఫిక్స్, సిజి, ఈ ఎఫ్ ఎక్స్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. యాక్షన్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తిరుగులేదు అనిపించారు. అయితే సినిమాకి గ్రాఫిక్స్ వి ఎఫ్ ఎక్స్ ఉంటే సరిపోదు.
మూవీ కి కావలసిన ఎమోషన్ ని కల్కి 28 98 మిస్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా విపరీతమైన ల్యాగ్ తో చంపేశాడు నాగి. అసలు సినిమా ఎందుకు చూస్తున్నామో అర్థం కాదు. ఎటు పోతుందో తెలీదు. చివరికి ఏమవుతుందో కూడా అంచనా వేయలేము. డైరెక్టర్ గా నాగి ఇక్కడ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎంత గొప్ప సినిమా అయినా… దాన్లో కథా బలం, ఎమోషన్ లేకపోతే అది పండదు. అది హాలీవుడ్ సినిమా అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఒకటే ఫార్ములా. బేసిగ్గా అది మిస్ అయ్యాడు డైరెక్టర్. ఎంచుకునే కథలు చందమామ కథలు అయినప్పటికీ ఎమోషన్ కి, టెక్నాలజీని కలిపి పండించగలడు రాజమౌళి. కానీ నాగ్ కల్కి 28 98 కి వచ్చేటప్పటికి ఎమోషన్ లేని టెక్నాలజీని చూడాల్సి వస్తుంది.
అందుకే కల్కి ఫెయిల్ అయింది. కల్కి పార్ట్ వన్ లో చెప్పడానికి ఏమీ లేదు పార్ట్ టూ కోసం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినట్లుగా ఉంది. షో స్టీలర్ ప్రభాస్ కేవలం 40 నిముషాల పాటే స్క్రీన్ పై కనిపించడం ఫ్యాన్స్ ను చిర్రెత్తించిన అంశం.. ఇక బడా స్టార్ల స్క్రీన్ అప్పియెరెన్స్ కూడా రెండు నిముషాల కన్నా మించదు.. కొన్ని చోట్ల అయితే నిముషం కన్నా తక్కువే! ఇది మరింత కోపం తెప్పించే టాపిక్! మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో కథ, ఎమోషన్ లో ఫెయిల్ అయి గ్రాఫిక్స్, వి ఎఫ్ ఎక్స్ లో పాసయ్యాడు డైరెక్టర్.