Dogs Rabies Virus : రేబిస్ వైరస్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏంటి..?
రేబీస్ వ్యాధీ అనేది కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, నక్కలు మొదలైన జంతువుల కాటు ద్వారా మనుషులకు వ్యాపించే వైరల్ వ్యాధి.. ఇది రేబిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెదడువాపు, వెన్నుపాము ప్రధాన అవయావల వాపుకు దారితీస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది\సంక్రమిస్తుంది.
రేబీస్ వ్యాధీ అనేది కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, నక్కలు మొదలైన జంతువుల కాటు ద్వారా మనుషులకు వ్యాపించే వైరల్ వ్యాధి.. ఇది రేబిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెదడువాపు, వెన్నుపాము ప్రధాన అవయావల వాపుకు దారితీస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది\సంక్రమిస్తుంది. ప్రపంచంలోని రేబిస్ మరణాలలో దాదాపు 36% ప్రతి సంవత్సరం భారతదేశంలో నమోదవుతున్నాయి. ఈ మరణాల్లో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు సోకడం ద్వారా మరణాల శాతం ఘణనియంగా పెరిగిపోతుంది. ఈ వ్యాధి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటు 24,000 – 60,000 మరణాలకు కారణమవుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి సోకుతున్న పిల్లల వయసు 15 ఏళ్లు లోపు ఉన్నవారే ఎక్కువ శాతం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.
మనుషులపై రేబిస్ వ్యాధీ ప్రభావం..
రేబిస్ బారిన పడిన కుక్క లాలాజలం ద్వారా మనిషికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ మానవ శరీరంలోని కణజాలాలలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సంక్రమించడం కొన్నిసార్లు జంతువు నుంచి మరో జంతువుకు కూడా సంక్రమిస్తుంది. ఈ రేబిస్ వ్యాధీ ఒక్క సారి మానవ శరీరంలోకి ప్రవేసిస్తే.. అక్కడి నుంచి అది నేరుగా కణజాలాలపై దాన్ని ప్రభావం చూపిస్తుంది. అక్కడితో అగకుండా మెదడుకు, వైరస్ వెన్నుపాము ద్వారా కేంద్ర నాడీ వ్యవస్థకు వెళుతుంది. ఈ వైరస్ మెదడుకు చేరినప్పుడు మెదడువాపు చెందుతుంది. ఇక వెన్నుపాముకూ ఈ వైరస్ ద్వారా వాపు వస్తుంది. దీంతో ఆ వ్యక్తి మరణించే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. లేదంటే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
రాబిస్ వ్యాధీ లక్షణాలు..
- నీటి భయం
- మెదడు వాపు
- వెన్నుపాము వాపు
- తలనొప్పి
- వికారం
- కడుపు నొప్పి
- కండరాల తిమ్మిరి
- నిద్రమత్తు
- నిద్రలేమి
- తీవ్రమైన జ్వరం
- ఆందోళన
- లాలాజలం అధిక స్రావం