కెప్టెన్సీ రేసులో రహానే, కోల్ కత్తా వ్యూహమేంటో ?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. గతేడాది కేకేఆర్ ని ఛాంపియన్గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతుంది. జట్టులో రసెల్, నరైన్‌ లాంటి సీనియర్లుగా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2024 | 01:50 PMLast Updated on: Dec 01, 2024 | 1:50 PM

What Is Rahane And Kolkatas Strategy In The Captaincy Race

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. గతేడాది కేకేఆర్ ని ఛాంపియన్గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతుంది. జట్టులో రసెల్, నరైన్‌ లాంటి సీనియర్లుగా ఉన్నారు. కానీ వాళ్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. 23 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌ కు కెప్టెన్సీ అనుభవం లేదు. ఇప్పుడు ఆ జట్టుకు ఉన్న ఏకైన ఆప్షన్ అజింక్య రహానే మాత్రమే. నిజానికి కేకేఆర్ కు రహానేను తీసుకోవాలన్న ఆలోచన లేదు. కెప్టెన్సీని దృష్టిలో ఉంచుకునే అతడిని కొనుగోలు చేసింది. అందుకే మొదటి రోజు అమ్ముడుపోని రహానెను రెండో రోజు వేలంలో కనీస ధర 1.75 కోట్లకు కోల్‌కతా తీసుకుంది.

ఐపీఎల్ కి ముందు రహానే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంతగానో ఉపయోగపడింది.ముంబై కేరళ మధ్య జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రహానే అర్ధ సెంచరీ సాధించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే 35 బంతుల్లో 194.29 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లతో పాటు 4 సిక్సర్లు బాదాడు. రహానే ఈ ఇన్నింగ్స్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం దృష్టిలో పడ్డాడు. అతడిని కెప్టెన్ చేయాలన్న కేకేఆర్ యాజమాన్యం ఆలోచన మరింత బలపడింది. అజింక్య రహానే 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 185 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 30.14 సగటుతో మరియు 123.42 స్ట్రైక్ రేట్‌తో 4642 పరుగులు చేశాడు. లీగ్‌లో 30 అర్ధ సెంచరీలతో పాటు 2 సెంచరీలు సాధించాడు.

రహానే మొదటి రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. తదుపరి 2 సీజన్లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌లో చేరాడు. 2018 మరియు 2019లో ఆర్ఆర్ లో భాగమయ్యాడు. ఇక 2020, 2021 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్, 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి కోల్‌కతాకు తిరిగొచ్చాడు.