క్రికెటర్ కు ఆ పొట్ట ఏంటి ? రోహిత్ పై కలినాన్ విమర్శలు
ప్రపంచ క్రికెట్ లో ఎంత గొప్ప స్టార్ ప్లేయరైనా కూడా ఫామ్ కోల్పోతే విమర్శలు ఎదుర్కోవాల్సిందే... అప్పటి వరకూ సాధించిన పరుగులు, అందుకున్న రికార్డులు ఇవేమీ విమర్శకులకు గుర్తుండవు.. వైఫల్యాల బాటలో ఉంచే చాలు ఇష్టానుసారం మాట్లాడేస్తుంటారు... ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
ప్రపంచ క్రికెట్ లో ఎంత గొప్ప స్టార్ ప్లేయరైనా కూడా ఫామ్ కోల్పోతే విమర్శలు ఎదుర్కోవాల్సిందే… అప్పటి వరకూ సాధించిన పరుగులు, అందుకున్న రికార్డులు ఇవేమీ విమర్శకులకు గుర్తుండవు.. వైఫల్యాల బాటలో ఉంచే చాలు ఇష్టానుసారం మాట్లాడేస్తుంటారు… ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన హిట్‌మ్యాన్.. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టుల్లో విఫలమవుతూ మాజీ క్రికెటర్లకి టార్గెట్‌గా మారాడు. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినాన్ రోహిత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని ఆటతీరును విమర్శిస్తునే రోహిత్ ఫిట్ నెస్ పై విమర్శలు గుప్పించాడు.
రోహిత్ టెస్టుల్లో విఫలం అవ్వడానికి అతని అధిక బరువే కారణమని కలినాన్ తేల్చి చెప్పేశాడు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై వెటకారం చేసిన కలినాన్.. అసలు టెస్టు క్రికెట్‌కే హిట్‌మ్యాన్ అనర్హుడని వ్యాఖ్యానించాడు. అధిక బరువు.. బెల్లీ ఫ్యాట్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లో ఆడే ఫిట్‌నెస్ అతనికి ఉన్నట్లు కనిపించడం లేదన్నాడు. విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే అతను టెస్టు ప్లేయర్‌గా అస్సలు కనిపించడన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు హాజరవ్వని హిట్ మ్యాన్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా అడిలైడ్ టెస్టులో పాల్గొన్నాడని, సెలక్షన్ కమిటీలో నేనుంటే రోహిత్ ను కచ్చితంగా జట్టులో స్థానం కల్పించే వాడిని కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు
న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయిపోయాడు. టెస్టుల్లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 8 ఇన్నింగ్స్‌ల్లో కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా టచ్ చేయలేకపోవడం అతని పేలవ ఫామ్‌కి ఇది నిదర్శనం. ఈ ప్రభావం అతని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. ఆరేళ్లలో తొలిసారి బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్-30లో చోటు కోల్పోయాడు. రోహిత్ పేలవ ఫామ్ ప్రభావం వ్యక్తిగతంగా అతని కెరీర్‌పైనే కాదు.. భారత్ జట్టుపై కూడా పడుతోందని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.