’17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని ఎందుకు పిలుస్తారు.. విక్రమ్ ల్యాండర్ ఒక వేళ ఈరోజు ల్యాండ్ అవకపోతే పరిస్థితి ఏంటి..?
చంద్రయాన్ -3 మన దేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం చూపును భారతదేశం తనపై తిప్పుకోగలిగే అద్భుతం నేడు ఆవిష్కృతం కానుంది. దీనికోసం మన దేశంలో చిన్న పిల్లల మొదలు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల వరకూ అందరూ పున్నమి చంద్రుడు లాంటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఇండియా గర్వించదగ్గ అంత్యరిక్ష పరిశోధన ఇది. ఈ ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 లో అత్యంత కీలకమైన గట్టం నేటి సాయంత్రం 6.04 నిమిషాలకు ఆవిష్కృతం కానుంది. ల్యాండర్ మాడ్యూల్ చంద్రడి దక్షిణ ధృవం పై సురక్షితంగా తన తొలి అడుగు పెట్టడం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. దేశం మొత్తం ఈ అద్భతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు సాయంత్రం 5.20 నుంచే ఇస్రో ప్రత్యక్షప్రసారాన్ని అందించనుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జయహో చంద్రయాన్, జయహో భారత్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో అత్యంత కీలకమైన ఘట్టం విక్రమ్ ల్యాండర్ చంద్రడిపై కాలుపెట్టే చివరి 17 నిమిషాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనినే 17 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని పేర్కొన్నారు.
17 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అంటే..
ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తైతే దాదాపు చంద్రుడిపైకి మన ల్యాండర్ సురక్షితంగా చేరుకున్నట్లే అంటున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈ చివరి 17 నిమిషాలో ల్యాండర్ తనలోని ఇంజన్లను అటోమేటిక్ గా మండించుకోగలగాలి. ఈ చర్య సరైన సమయానికి జరగడంతో పాటూ అవసరమైన ఇందనాన్ని వినియోగించుకోవడం చాలా కీలకం. ఇందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు జరిగినా ప్రయోగం మొత్తం విఫలం అవుతుంది. అందుకే ఈ నరాలు తెగే ఉత్కంఠ కోసం యావత్ ప్రపంచంతో పాటూ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా క్షుణ్ణిగా పరిశీలిస్తున్నారు.
చర్య జరిగే విధానం ఇదే
ల్యాండర్ మాడ్యూల్ లో నాలుగు కీలకమైన థ్రస్టర్ ఇంజిన్లు అమర్చి ఉంటారు. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో వీటిని మండిస్తారు. అప్పుడు వేగంగా భ్రమించే ల్యాండర్ వేగం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ల్యాండర్ మాడ్యూల్ తనలోని సైంటిఫిక్ పరికరాల సహాయంతో ల్యాండింగ్ అయ్యే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ఆ ప్రదేశంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా ఉంటే బుధవారం ల్యాండింగ్ అవుతుంది. లేదంటే ఈ ప్రక్రియ వాయిదా పడేఅవకాశం ఉంటుంది.
ఈరోజు సేఫ్ ల్యాండింగ్ కి వీలుపడకపోతే..
చంద్రుడిపై ఉన్న పరిస్థితులను అక్కడి ఉపరితలాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే ల్యాండింగ్ చేసేందుకు వీలుపడుతుంది అంటున్నారు ఇస్రో సైంటిస్ట్లు. ఒకవేళ చదునైన ప్రదేశం ఈరోజు గుర్తించలేక పోతే తిరిగి ఈనెల 27న సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన తెలిపారు ఇస్రో డైరెక్టర్ నీలేశ్ దేశాయ్. బుధవారం పరిస్థితులు అన్నీ అనుకూలించి, ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే కచ్చితంగా ల్యాండ్ అవుతుంది. అదే మాడ్యూల్ ల్యాండర్ తన పరిధిలో తాను పనిచేయకుండా ఏమైనా సమస్యలు తలెత్తితే వాయిదా వేయాల్సి వస్తుంది. చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టే సమయానికంటే రెండు గంటల ముందు దానికి అవసరమైన కమాండ్ లను అప్లోడ్ చేయనున్నట్లు ఇస్రో తెలిపింది.
T.V.SRIKAR