Jr.NTR: దుబాయ్ చెక్కేసిన తారక్..! బాబు కుటుంబంతో పూర్తిగా తెగినట్లేనా..?
జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ వదికగా జరుగుతున్న సైమా అవార్డ్స్ 2023 కి హాజరవడం వెనుక ఆంతర్యమేటిటి. పైగా వాటి ఫోటోలను కూడా షేర్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారా.? ఈయన చేస్తున్న పనులే దీనికి సంకేతమా..? ప్రస్తుత ఏపీ రాజకీయాలలో వాడి వేడి పరిస్థితుల నడుమ జూనియర్ స్పందించకపోవడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు కుటుంబం పట్ల ఎలాంటి ఉద్దేశ్యం లేదని.. నాకు చాలా పనులు ఉన్నాయి అనే విషయం పరోక్షంగా చెబుతున్నారా..? ఈ అంశంపై మరింత స్పష్టత ఇస్తూ దుబాయ్ వెళుతున్నారా అన్న చర్చ మొదలైంది.
2009లో క్రియాశీలక పాత్ర
జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమాతో తన ఖ్యాతిని విదేశాలకు విస్తరించిన గొప్ప నటుడు. నందమూరి తారక రామారావు మనుమడిగా తెరపైకి వచ్చి అందనంత కీర్తిని గణించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోశించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అయితే అప్పటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చరిష్మా, సంక్షేమం ముందు టీడీపీ కొట్టుకొని పోయింది. అయితే జూనియర్ బాగా రాణించగలిగారు. రాజకీయాలకు పనికొస్తారని చాలా మంది రాజకీయ విమర్శకులు సైతం ప్రశంసించేలా ప్రసంగాలు ఇచ్చారు. అచ్చం తాత లాగే ఖాకీ దుస్తులు ధరించి పచ్చ కండువా మెడలో వేసుకుని చంద్రబాబును అధికారంలోకి తేవడానికి సాయ శక్తులా కృషి చేశారు. ఆతరువాత పార్టీలో ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం చంద్రబాబు దూరం పెట్టారనే వాదనలు వినిపించాయి.
తండ్రి అవమానం గుర్తుందా..
ఈ చర్చ ఇలాగే కొనసాగుతున్న తరుణంలో హరికృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వడం తిరిగి కొన్ని నెలలకే రాజీనామా చేయించడం. ఎన్నికకు పోనివ్వకుండా చూడటం దీంతో తన రాజ్యసభ సభ్యత్వానికి అనర్హత వేటుపడటం లాంటివి జూనియర్ ఇంకా గుర్తుపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆతరువాత హరికృష్ణ ఆరోగ్యం క్షీణించడం, ఎవరూ ఆయనను పట్టించకోక పోవడం, చివరకు మరణించడం లాంటివి వెనువెంటనే జరిగిపోయాయి. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. మన బ్రతుకు సినీ పరిశ్రమలోనే అని ఫిక్స్ అని భావించి టీడీపీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. క్రమక్రమంగా చంద్రబాబుతో కూడా అంటిముట్టనట్లు వ్యవహరించారు. బాలయ్యతో కాస్త సఖ్యతగా మెలిగినప్పటికీ అది ఎంతో కాలం నిలువలేదు. దీంతో పూర్తిగా పార్టీని, కుటుంబాన్ని, బంధుత్వాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయం కాదు.. సినిమాలే లక్ష్యమా..
ఇలా అన్నింటినీ వదిలేసి తన జీవన మార్గం సినిమా అని పూర్తిగా సమయాన్ని కేటాయించారు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో త్రిపుల్ ఆర్ విజయం సాధించారు. అంతర్జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవిజయాన్ని వదలకుండా దేవర సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇందుకు సంకేతంగా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడం, యుగపురుషుడు 100 నాణెం విడుదల కార్యక్రమాన్ని విస్మరించడం, తాజాగా ఏపీ లో చంద్రబాబు అరెస్ట్ విషయం పై ఒక ట్వీట్ కూడా చేయలేదు. తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ -2023 లో పాల్గొనేందుకు దుబాయ్ బయలుదేరారు. ఈ విషయాన్ని తెలిపేందుకు విమానాశ్రయంలో తోటి నటీ నటులతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. తారక్ కు ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు. ఈ అవార్డును తీసుకొని ఆనందంలో గడిపేందుకు దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
విమర్శకులకు వివరణ..
కుటుంబంలో సొంత మామయ్య జైలులో ఉంటే కలిసేందుకు రాకుండా ఇలా దుబాయ్ వెళ్లడం వెనుక చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు అనే స్పష్టతను మరింత స్పష్టంగా చెప్పకనే చెప్పే ప్రయత్నంగా చూడాలని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అర్థం అవుతోందంటున్నారు పరిశీలకులు.
T.V.SRIKAR