కెఎల్ రాహుల్ కు గుడ్ బై కారణం ఏమిటంటే ?

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు ఇంకా వారం రోజులే గడువుంది. అక్టోబర్ 31 లోపు బీసీసీఐ ప్రతీ ఫ్రాంచైజీ తమ లిస్టును పంపించాలి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ పై ఫ్రాంచైజీల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2024 | 08:05 PMLast Updated on: Oct 23, 2024 | 8:05 PM

What Is The Reason For Goodbye To Kl Rahul

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు ఇంకా వారం రోజులే గడువుంది. అక్టోబర్ 31 లోపు బీసీసీఐ ప్రతీ ఫ్రాంచైజీ తమ లిస్టును పంపించాలి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ పై ఫ్రాంచైజీల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సారి ఆరుగురిని రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీనిలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు షాకివ్వడం ఖాయమైంది. వేలానికి ముందు రాహుల్ కు ఆ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పబోతోంది. పేలవ ఫామ్‌తో ఇప్పటికే భారత్ టెస్టు జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న కేఎల్ రాహుల్‌ని ఐపీఎల్ 2025 సీజన్ కోసం రిటెన్ చేసుకోకూడదని లక్నో ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

2022 సీజన్ నుంచి లక్నో‌కి కేఎల్ రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్యాటర్ గా మాత్రం స్థాయికి తగినట్టు ఆటతీరు లేదు. అతని స్ట్రైక్‌రేట్ షార్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు లేదు. ఈ కారణంతోనే రాహుల్ జట్టుకి భారమవుతున్నాడని లక్నో ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడ్ని వేలంలోకి వదిలేయాలని భావిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో ఇప్పటికే చర్చించిన లక్నో ఫ్రాంఛైజీ ఆటగాళ్ల డేటాను విశ్లేషించి.. రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేఎల్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేసిన దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ లక్నో టీమ్ ఓడిపోయినట్లు గుర్తించారు. దాంతో రాహుల్ స్ట్రైక్ రేట్ టీమ్‌కి ఉపయోగపడటం లేదని నిర్ధారించుకుని.. వేలంలోకి వదిలేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎంట్రీతో ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగుతోంది . టోర్నీలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అదే సమయంలో నిదానంగా బ్యాటింగ్ చేసేవారిని ఫ్రాంఛైజీలు జట్టులో ఉంచేందుకు ఇష్టపడడం లేదు. 2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 132 మ్యాచ్‌లాడి 4,683 పరుగులు చేశాడు. దీనిలో 4 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి ప్లేఆఫ్స్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. ఒకవేళ కేఎల్ రాహుల్ వేలానికి వస్తే అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ గట్టిగా పోటీపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌‌తో పాటు రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రిటెన్ చేసుకునే అవకాశం ఉంది. వీరితో పాటు ఆయుష్ బదోనీ, మోహ్సిన్ ఖాన్‌ని రిటెన్ చేసుకోవడంపైనా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.