Madhavilatha : మాధవీలతకు బీఫామ్ ఇవ్వని బీజేపీ.. కారణం ఏంటి ?
హైదరాబాద్ (Hyderabad) లోక్‌సభ స్థానంలో ఒవైసీని సవాల్ చేస్తున్న మాధవీలత.. ప్రచారంలో దూసుకుపోతోంది.
హైదరాబాద్ (Hyderabad) లోక్‌సభ స్థానంలో ఒవైసీని సవాల్ చేస్తున్న మాధవీలత.. ప్రచారంలో దూసుకుపోతోంది. క్షేత్రస్థాయితో పాటు.. సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటోంది. తన మార్క్ ఘాటైన విమర్శలతో.. రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. నవార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించే హైదరాబాద్ రాజకీయంలో.. ఒక్కసారిగా మాధవీలత కదలిక తీసుకువచ్చారు. ఐతే మాధవీలత జోరు ప్రచారం సాగిస్తున్న వేళ.. బీజేపీ ఆమెకు షాక్ ఇచ్చింది. బీఫామ్ ఆపేసింది.
ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలుకాగా.. అభ్యర్థులంతా ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఫామ్ (Befam) నిలిపివేయడంపై.. కొత్త చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతుందన్న బీజేపీలో ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇప్పటి కొంతమంది అభ్యర్థులకు బీఫామ్‌లు అందించిన కమలం పార్టీ.. మాధవీలతతో పాటు మరో ముగ్గురికి కూడా ఆపేసింది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), రఘునందన్ రావు, డీకే అరుణ (DK Aruna), బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) తదితరులు వివిధ నియోజవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బీఫామ్ పెండింగ్‌లిస్ట్‌లో మాధవీలతతో పాటు.. పెద్దపల్లి నుంచిగోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ సీతారాం నాయక్, నల్గొండ సైదిరెడ్డి ఉన్నారు.
ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల్ని మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నవేళ.. వీళ్లకు బీఫామ్‌లు పెండింగ్‌లో పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఐతే అభ్యర్థులపై అసంతృప్తితోనే బీఫామ్ నిలిపివేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. మాధవీలత కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఓ కారణం అంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.