Death Mystery : పోర్న్ స్టార్‌ల వరుస చావుల రహస్యం ఏంటి..?
అడల్ట్ సినీ పరిశ్రమను (Adult Film Industry) రోజు రోజుకూ విషాదాలు వెంటాడుతున్నాయి.. కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్లు మృతి చెందడం షాకిస్తోంది. అయితే అవి సాధారణ మరణాలు కాకుండా.. ఆత్మహత్యలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా 26 ఏళ్ల పోర్న్ స్టార్ సోఫియా లియోనీ (Sophia Leone), తన గదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపుతోంది.

What is the secret behind the serial deaths of porn stars?
అడల్ట్ సినీ పరిశ్రమను (Adult Film Industry) రోజు రోజుకూ విషాదాలు వెంటాడుతున్నాయి.. కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్లు మృతి చెందడం షాకిస్తోంది. అయితే అవి సాధారణ మరణాలు కాకుండా.. ఆత్మహత్యలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా 26 ఏళ్ల పోర్న్ స్టార్ సోఫియా లియోనీ (Sophia Leone), తన గదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపుతోంది. మొదట జనవరి 6న తైనా ఫీల్డ్స్, జనవరి 24న జెస్సీ జేన్, ఫిబ్రవరి 15న కాగ్నీ లిన్ కార్టర్, తాజాగా సోఫియా లియోన్ మరణించారు. పోర్న్ ఇండస్ట్రీలో (porn industry) మోగుతోన్న మరణ మృదంగం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోర్న్ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది అంటూ తీవ్ర చర్చ జరుగుతోంది.
మొదటిసారి మరణించిన తైనా ఫీల్డ్స్ వయస్సు 25 ఏళ్లు.. తన ఇంట్లో జనవరి 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె మరణించకముందు అడల్ట్ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ తర్వాతనే ఈ ఘటన ఆ తర్వాతనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆమె మరణం వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా జెస్సీ జేన్ అనే మరో పోర్న్ స్టార్ కూడా జనవరి 24న తన నివాసంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్లనే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో.. జెస్సీ జేన్ మృతి కూడా వివాదాస్పదమైంది.
మరో నటి కాగ్నీ లిన్ కార్టర్ ఫిబ్రవరి 15న మృతి చెందింది. 36 ఏళ్ల కాగ్నీ.. తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే అందుకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కాగ్నీ అడల్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పిన అనంతరం సొంతంగా ఫిట్‌నెస్ స్టూడియో పెట్టుకుంది. అయితే అలా పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పుడు రీసెంట్‌గా మార్చి 1న సోఫియా లియోన్ మరణించగా మార్చి 9న వెలుగులోకి వచ్చింది. సోఫియో లియోన్ కూడా తను నివాసముండే ఇంటిలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె పెంపుడు తండ్రి అంత్యక్రియలకు డబ్బులు కావాలని ఓ సంస్థను కోరడంతో సోఫియా మరణ వార్త బయటకు వచ్చింది. ఈ నటి మృతిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తడంతో అనుమానాస్పద మరణం కిందనే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోర్న్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వరుస మరణాలు మిగిలిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు అడల్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల గ్యాప్‌లోనే నలుగురు పేరున్న పోర్న్ స్టార్లు మృతి చెందడం హాట్ చర్చకు దారి తీస్తోంది. పైగా వీరు ఇప్పుడిప్పుడే బయట సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుంటుండగా, ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక ఈ ఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అడల్ట్ ఇండస్ట్రీని వదిలి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడంతో.. ఈ మరణాల వెనక అసలు కారణాలు ఏంటా అన్న అనుమానాలు తొలిచేస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా పోర్న్ స్టార్ జీవితాలు పూల పాన్పులు కావని, వాటి వెనకాల బయటకు తెలియని చీకటి రహస్యాలు ఎన్నో ఉంటాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.