Telangana elections : తెలంగాణలో పదేళ్లలో కేసీఆర్ ఏం చేసింది లేదు.. కేటీఆర్ ను సీఎంను చేయడమే కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై అమిత్ షా సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని విమర్శించారు. తన కుమారుడు కేటీఆర్ ను సీఎం గా ఎలా చేయాలనే దానిపై కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేసీఆర్ విమర్శించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2023 | 05:05 PMLast Updated on: Nov 25, 2023 | 5:05 PM

What Kcr Has Not Done In Telangana In Ten Years Kcrs Aim Is To Make Ktr The Cm

తెలంగాణ సీఎం కేసీఆర్ పై అమిత్ షా సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని విమర్శించారు. తన కుమారుడు కేటీఆర్ ను సీఎం గా ఎలా చేయాలనే దానిపై కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

Hattrick CM KCR : కేసీఆర్‌ది మాములు లక్‌ కాదుగా..

కేసీఆర్ పదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు, రైతులకు లక్ష రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను గాలికి వదిలేశారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్‌ 17 నిర్వహణపై కేసీఆర్ మాట ఇచ్చి తప్పారు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు అన్ని కూడా ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో ప్రచారం జరుపుతున్నారు. ఎన్నికలు అయ్యాక ముగ్గురు ఒక్కటైవుతారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు ఓటేసినట్లే. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి.