JC Diwakar Reddy : ఎలాంటి జేసీ దివాకర్ రెడ్డి.. ఎలా అయిపోయాడు…?
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్‌లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్‌లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు. ఒకప్పుడు పరిటాల రవి మర్డర్ కేసులో కూడా పేరు ప్రముఖంగా వినిపించింది. దివాకర్ ట్రావెల్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన దివాకర్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి. ఎవరి మీద అయినా ఎలాంటి విమర్శలు అయినా… చేయగలిగిన వివాదాస్పద రాజకీయ నేత.
కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. అన్ని పార్టీలతోనూ సంబంధాలు ఉండేవి ఆయనకి. ఎంత పెద్ద లీడర్‌నైనా.. ఎలాంటి మాటైనా వెనక ముందు చూడకుండా నిర్మామాటంగా మాటలు విసిరేసేవాడు జేసీ దివాకర్ రెడ్డి. దివాకర్ రెడ్డి పెట్టుకునే వాచీలు, గాగుల్స్‌పై ఒకప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ జరిగేది. 50ఏళ్ల పాటు తాడిపత్రిపై జేసీ కుటుంబం ఆధిపత్యం నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతర్దానం అయిపోవడంతో.. అప్పటివరకు ప్రత్యర్థిగా ఉన్న టీడీపీలోకి మారిపోయారు జేసీ. అక్కడినుంచి వైఎస్ జగన్‌తో జేసీ బ్రదర్స్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కానీ వయసు పైబడిపోవడం… రాజకీయాల్లో పోటీ పడలేకపోవడంతో… క్రమంగా జేసీ హవా తగ్గుతూ వచ్చింది.
ఇప్పుడు ఆయన రూపం కూడా మారిపోయింది. అప్పటి జేసీకి, ఇప్పటి జేసీ దివాకర్ రెడ్డికి ఎంత తేడా… నడక మారిపోయింది. మాట తడబడుతుంది. మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. చెప్పిన మాట మళ్లీ గుర్తు ఉండడం లేదు. జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అక్కడ రాజకీయం నడిపిస్తున్నాడు. కానీ కొత్త తరంతో పోటీ పడలేకపోతున్నారు. జేసీ కొడుకు పవన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి.. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నా, తండ్రుల్లాగా జిల్లాని మొత్తం కంట్రోల్‌లో పెట్టుకునే శక్తి మాత్రం వాళ్లకి లేదు. చాలామంది జేసీ దివాకర్ రెడ్డిని చూసి… కాలం తెచ్చిన మార్పు అంటే ఇలాగే ఉంటుంది…. ఎలాంటి జేసి ఇలా అయిపోయాడు అని అనుకుంటున్నారు.