‍Narendhra Modi: సెప్టెంబరు 15న మోడీ మరో సంచలనం.. ఏం జరగబోతోంది ?

ఈనెల 15 దేశంలో ఏం జరగబోతోంది. మోదీ ఏం చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 12:27 PMLast Updated on: Sep 12, 2023 | 12:27 PM

What Will Happen In The Special Session Of Parliament On 15th Of This Month

స్పెషల్ పార్లమెంట్ సెషన్ పై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి టైంలో మరో కీలక వార్త బయటికి వచ్చింది. పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా మూడు రోజుల ముందు (ఈనెల 15న) కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. జులై మొదటివారం నుంచి వాయిదా పడుతూ వస్తున్న క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ ఎట్టకేలకు మరో 3 రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ సమీపించడంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోడీ నిర్ణయించారట. అందుకే పార్లమెంటు సెషన్ కంటే ముందే ఆ దిశగా ముందడుగు వేయనున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ విజన్ కు అనుగుణంగా పనిచేయగలిగే వారికి క్యాబినెట్ లో బెర్తులు దక్కుతాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దీంతో క్యాబినెట్ విస్తరణలో ఎవరికి మోదం.. ? ఎవరికి ఖేదం ? అనే దానిపై వాడివేడి డిస్కషన్ నడుస్తోంది.

ఎన్సీపీ, శివసేన తిరుగుబాటుదారులకు పెద్దపీట..

ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ పోల్స్ జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు కేంద్ర క్యాబినెట్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఈ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే కూటమిలోని పార్టీల కీలక ఎంపీలకు కూడా క్యాబినెట్ మినిస్టర్లుగా ఛాన్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కు బెర్త్ దక్కడం ఖాయమని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి బీజేపీ ప్రభుత్వంలో చేరిన ఎన్సీపీ ఎంపీ, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ను మోడీ తన టీమ్ లోకి తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీకి సపోర్ట్ గా కొత్త రాజకీయ పక్షాన్ని ఏర్పాటుచేసిన ఏక్ నాథ్ షిండే వర్గం నుంచి ముగ్గురు ఎంపీలను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోనున్నట్టు సమాచారం.

కీలక మంత్రులు ఔట్.. ఎందుకంటే ?

కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్ జోషి.. ప్రధాని మోడీకి సన్నిహితంగా ఉంటారు. వాస్తవానికి వీరి పనితీరుపై చాలామంచి రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే బీజేపీ లోక్ సభ ఎన్నికల వ్యూహరచన టీమ్ లోకి తీసుకునే ఉద్దేశంతో వారిని ప్రస్తుతానికి క్యాబినెట్ నుంచి తప్పిస్తున్నారని తెలిసింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి దర్శన జర్దోష్‌లపై వేటు పడే అవకాశం ఉంది. వీరితోపాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్‌జాలే, బిహార్‌కు చెందిన అశ్విని చౌబే, పశుపతి పరాస్, ఆర్కే సింగ్‌, యూపీకి చెందిన మహేంద్రనాథ్‌ పాండే, అజయ్‌ మిశ్రా, మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే, రాందాస్ అథవాలే, రాజస్థాన్ కు చెందిన గజేంద్ర సింగ్ షెకావత్‌లను క్యాబినెట్ నుంచి తప్పించనున్నారనే ప్రచారం జరుగుతోంది.