ICC WORLD CUP 2023 : ఒరిజినల్ వరల్డ్ కప్ ఏం చేస్తారు ..? గెలిచిన జట్టుకు అసలు కప్పు ఇస్తారా..?
ICC ప్రతి నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్ ను నిర్వహిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందిస్తుంది. కానీ ఆ ట్రోఫీ ఆ దేశం దగ్గరే ఉంటుందా... లేకపోతే ఐసీసీ తీసుకెళ్ళిపోతుందా. ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు.
ICC ప్రతి నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్ ను నిర్వహిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందిస్తుంది. కానీ ఆ ట్రోఫీ ఆ దేశం దగ్గరే ఉంటుందా… లేకపోతే ఐసీసీ తీసుకెళ్ళిపోతుందా. ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు.
Sonia Gandhi : టీమిండియా గెలుస్తుంది.
1975లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో వరుసగా 3సార్లు ఇంగ్లండ్‌లోనే ఈ టోర్నీని నిర్వహించారు. అప్పట్లో ప్రూడెన్షియల్ కప్ ట్రోఫీ పేరుతో నిర్వహించారు. 1975, 1979, 1983లో ప్రపంచ కప్ గెలిచిన జట్లకు ఇదే ట్రోఫీని ఇచ్చారు. కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని భారత్ జట్టు ప్రపంచకప్ అందుకున్నది కూడా ఈ ట్రోఫీనే. అయితే తర్వాత 1987లో మొదటిసారి వరల్డ్‌కప్ క్రికెట్ భారత్ లో జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి నిర్వహించిన ఈ టోర్నీకి ‘రిలయన్స్ కప్ ట్రోఫీ అని పేరు పెట్టారు. 1992 వరల్డ్‌కప్‌కు బెన్సన్ అండ్ హెడ్జెస్ ట్రోఫీ అని పిలిచారు. 1996లో విల్స్ కప్ ట్రోఫీ అన్నారు. ఇలా నాలుగేళ్ళకోసారి జరిగే ODI ప్రపంచ కప్ టోర్నీకి పేరు మారుస్తూ వచ్చారు. కానీ 1999 నుంచి ఐసీసీయే ట్రోఫీని అందించడం మొదలుపెట్టింది.
India VS Australia : టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల టార్గెట్
ఇప్పుడు మూడు వైపులా వికెట్ల లాగా ఉండి… మధ్యలో బాల్ పై విశ్వం ఉండేలా ట్రోఫీని తయారు చేశారు. ఈ ట్రోఫీని 1999, 2003,2007, 2011, 2015, 2019లో గెలిచిన జట్లకు అందించారు. ఒకటే కప్పును ఇస్తున్నారా… లేదంటే… ప్రతిసారీ ప్రత్యేకంగా ట్రోఫీని తయారు చేస్తున్నారా అంటే… ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టుకు గ్రౌండ్ లో ముందుగా ఒరిజినల్ ట్రోఫీని ఇస్తారు. కానీ ఆ తర్వాత ఆ ఒరిజినల్ ట్రోఫీని తిరిగి దుబాయ్‌లో ఉన్న ICC హెడ్డాఫీస్ కు తరలిస్తారు. విజేత అయిన జట్టుకు దీని మోడల్ ట్రోఫీని అందిస్తారు. ఒరిజినల్ ట్రోఫీ 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. బంగారం, వెండితో దీన్ని తయారు చేస్తారు. దీని బరువు 11 కేజీలు దాకా ఉంటుంది. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. విజేతల పేర్లను రాసేందుకు వీలుగా ఈ ఒరిజినల్ ట్రోఫీ అడుగు భాగంలో ప్రత్యేక బేస్ ను ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద అసలు ట్రోఫీ దుబాయ్‌లో ఐసీసీ ఆఫీసులో ఉంటే.. దాని డూప్లికేట్ ను కప్ గెలిచిన జట్టు తీసుకెళ్తుంది.