Nalini : నళినికి ఉద్యోగం ఇస్తే తప్పేంటి ? రేవంత్ ఆలోచన మాములుగా లేదుగా !
2012 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న కాలంలో... నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్ళను నేను లాఠీలతో కొట్టలేదు. వాళ్ళపై తూటాల్ని ఎక్కుపెట్టలేనంటూ కొలువును త్యాగం చేసింది.
2012 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న కాలంలో… నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్ళను నేను లాఠీలతో కొట్టలేదు. వాళ్ళపై తూటాల్ని ఎక్కుపెట్టలేనంటూ కొలువును త్యాగం చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆమె ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక.. నళికనికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. అవును… నళికి కొలువు ఇస్తే తప్పేంటి అని సీఎం కూడా ఆలోచన చేశారు. ఆమెకు ఆసక్తి ఉంటే వెంటనే జాబ్ ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం లేవనెత్తిన అంశాలను అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నళిని 2007లో గ్రూప్ 1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. ట్రైనింగ్, ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నాక… కరీంనగర్ డీఎస్పీగా నియమితులయ్యారు. తర్వాత కొన్ని రోజులకే మెదక్ డీఎస్పీగా బదిలీ అయింది నళిని. ఆ టైమ్ లోనే ఆమె తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చారు. పోలీస్ శాఖలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఎక్కువైందని విమర్శించారు. ఉద్యమ సమయంలోనే నళినీని 2011 డిసెంబర్ 4నాడు సస్పెండ్ చేశారు ఉమ్మడి ఏపీలోని పోలీస్ అధికారులు. అప్పట్లో ఈ ఇష్యూ తెలంగాణ ఉద్యమంలో హైలెట్ గా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతిచ్చినా పాపానికి ఆమెను దేశద్రోహిగా చిత్రీకరించారు అప్పటి పోలీస్ అధికారులు. తర్వాత సుష్మాస్వరాజ్ చొరవతో బీజేపీలో చేరింది నళిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె మళ్ళీ కనిపించలేదు. ఈమధ్యకాలంలోనే నళినికి.. కేసీఆర్ హయాంలో న్యాయం జరగలేదనీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా తిరిగి డీఎస్పీ కొలువు ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి. నళినీ మాత్రం తాను ఆధ్యాత్మిక, యోగా జీవితంలో గడుపుతున్నాననీ.. తనకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం కోసం కొలువు త్యాగం చేసిని మాజీ డీఎస్పీ నళినికి మళ్ళీ ఉద్యోగం ఇస్తేంటి తప్పేంటని పోలీస్ అధికారులను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే తిరిగి చేర్చుకోవాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలిచ్చారు. పోలీస్ శాఖలో నియామకానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే.. అదే హోదాలో ఆమెకు వేరే శాఖలో కొలువు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వాదన లేవనెత్తారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయిన వారిని చాలామందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి కొలువు ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు.. నళినికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలని ప్రశ్నించారు.
నళిని మాత్రం ప్రస్తుతం ఆధ్యాత్మిక, యోగా జీవితంలో గడుపుతున్నాననీ.. 12యేళ్ళ తర్వాత నేను ఎలా గుర్తుకొచ్చానని ప్రశ్నిస్తున్నారు. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందనీ.. డీఎస్పీ కొలువు చేయలేనని చెబుతోంది. అందుకే పోలీస్ శాఖలో కాకుండా.. తన హోదాకి తగ్గట్టుగా వేరే శాఖలో అయినా కొలువు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కొలువు ఇద్దామని ప్రతిపాదన చేయడంతో మరి నళిని ఒప్పుకుంటారా ? డీఎస్పీ కాకపోయినా… వేరే కొలువులో అయినా జాయిన్ అవుతారా అన్నది చూడాలి.