Deepfake: డీప్ ఫేక్ సమస్యకు చెక్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ.. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెను ముప్పుగానే చూడాలి. అందుకే.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా.
Deepfake: ప్రస్తుతం డీప్ ఫేక్ టెక్నాలజీ సమస్యగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, విరాట్ కోహ్లీ, రష్మిక మందన్నా సహా పలువురు సెలబ్రిటీలు ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆధునిక ఏఐ సాంకేతికత సాయంతో మనిషిని పోలినట్లుగా ఉండే ఆడియో, వీడియోలు రూపొందించడమే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ.. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెను ముప్పుగానే చూడాలి.
YS JAGAN: వాట్ ఏ ప్లాన్.. ఒక్క మాట అనకుండా చెల్లికి చెక్ పెట్టిన జగన్..
అందుకే.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా. మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ)తో కలిసి డీప్ ఫేక్ టెక్నాలజీని అరికట్టబోతుంది. ఇది ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ పార్ట్ నర్స్, డిజిటల్ ల్యాబ్ లతో కలిసి పనిచేస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్‌ను ప్రారంభించబోతున్నారు. వచ్చే మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసే డీప్ ఫేక్ వీడియోలను ప్రజలు విశ్వసించకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా వాట్సాప్ ఈ హెల్ప్ లైన్ అందుబాటులోకి తేనుంది. హెల్ప్‌లైన్ సర్వీస్ ఇంగ్లీష్‌లోనే కాకుండా.. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
దీని ద్వారా యూజర్లు డీప్ ఫేక్ వీడియో, ఆడియోలను ఫ్లాగ్ చేసి వాట్సాప్ చాట్ బాట్‌కు పంపించాలి. ఆ వీడియోలను ఎంసీఏ టీమ్ విశ్లేషించి, అది డీప్ ఫేక్ వీడియోనా..? కాదా? అనే విషయాన్ని తేలుస్తుంది. అది డీప్ ఫేక్ అని తేలితే సంబంధిత దర్యాప్తు విభాగాలకు సమాచారం అందిస్తుంది. వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను ఒకటికి రెండుసార్లు విశ్లేషించుకోవాలని మెటా సూచించింది.