Sarpanch election : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..

తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమం మొదలైంది. రాష్ట్రం అంతా హడావుడి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్.. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ నేతలు, అధికారులు.. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ప్రధానంగా తిరుగుతున్న ప్రశ్న ఒక్కటే.. అదే సర్పంచ్‌ ఎన్నికలు ఎప్పుడా అని! ఐతే తెలంగాణలో ఇప్పట్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 01:58 PMLast Updated on: Dec 28, 2023 | 1:58 PM

When Is Sarpanch Election In Telangana

తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమం మొదలైంది. రాష్ట్రం అంతా హడావుడి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్.. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ నేతలు, అధికారులు.. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ప్రధానంగా తిరుగుతున్న ప్రశ్న ఒక్కటే.. అదే సర్పంచ్‌ ఎన్నికలు ఎప్పుడా అని! ఐతే తెలంగాణలో ఇప్పట్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 31తో ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ముగియ‌నుంది. ఆనాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్నికలు జరిపించేందుకు ఈసీ కూడా రెడీగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాసెస్ మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణకు వివరాలు పంపాలని ప్రభుత్వానికి, కలెక్టర్లకు లెటర్ రాసింది. ఐతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదని పంచాయతీరాజ్, ఈసీ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పంచాయతీ ఎన్నికలకు వెళ్తే.. నెలరోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది.

ప‌రిపాల‌న కార్యక్రమాలు ముందుకు సాగవు. 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈసారి తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. అందుకే లోక్‌సభ ఎన్నికల్లోపు 6 గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తోంది. 6 గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్తే.. లాభం జరుగుతుందనే ప్లాన్‌లో ఉంది రేవంత్ సర్కార్‌. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన వెంటనే అదే ఊపులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా బిల్లులు పెండింగ్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్‌కు 5లక్షల నుంచి 15లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కలన్నీ తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో రెండు నెలల పాటు తెలంగాణలో ప్రతీ గ్రామానికి సర్పంచ్ పోస్ట్ ఖాళీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.