AP Government: అదిరిపోయే ఆఫర్.. 50 రూపాయలకే కిలో టమాటా..
టమాట మాట వినడం లేదు. టమాట లేని కూరలే కనిపిస్తున్నాయ్ మధ్య తరగతి కుటుంబాల్లో ! ఇప్పటికే సెంచరీ దాటేసిన కిలో టమాట ధర.. సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 120 రూపాయలకు అటు ఇటుగా కిలో టమాటా ధర పలుకుతోంది.

When tomato prices are rising, the Jagan government in AP has decided to sell them to common people at 50 rupees per kg from farmers' bazaars below the market price
ఇలాంటి సమయంలో టమాట ధరల పోటు నుంచి జనాలను కాపాడేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది. రైతు బజార్లలో 50రూపాయలకు కిలో టమాటాలను అమ్మే విధంగా చూస్తోంది. ఏపీలోని 103 రైతు బజార్లలో.. కిలో 50 రూపాయలకే విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ మార్కెట్‌లో కిలో టమాటాలు 100 రూపాయలకు మించి పలుకుతోంది. జనాల డిమాండ్లను తీర్చడానికి అవసరమైన కూరగాయలను స్థిరంగా, సరఫరా చేసేలా చూసేందుకు.. రోజూ 50 టన్నుల టమోటాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రోజూ రైతు భరోసా కేంద్రం దగ్గర ఎప్పటికప్పుడు ధరలు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజల డిమాండ్‌లకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతోంది. ఇప్పుడు టమాటా విషయంలోనూ అదే ేచయబోతోంది. పెరుగుతున్న టమాటా ధరల ప్రభావం.. జనాలపై భారీగా పడుతుందని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల టమోటాలను సేకరించింది. ఈ టొమాటోలు వివిధ రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులకు వీటిని సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉండేలా చేస్తోంది సర్కార్. మార్కెట్ ధరలు స్థిరంగా ఉండే వరకు సేకరణ ప్రయత్నాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ సర్కార్ నిర్ణయంతో ఇప్పుడు జనాలను కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.