ఆళ్ళ ఎక్కడ…? జగన్ ను పలకరించలేదేం…?
ఆళ్ళ రామకృష్ణా రెడ్డి... వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు ఒకప్పుడు. పార్టీ నేతల్లో గాని, కార్యకర్తల్లో గాని ఆయన అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది.
ఆళ్ళ రామకృష్ణా రెడ్డి… వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు ఒకప్పుడు. పార్టీ నేతల్లో గాని, కార్యకర్తల్లో గాని ఆయన అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. పార్టీకి అండగా నిలబడాల్సిన టైం లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఎందుకు దూరం పాటిస్తున్నారు అనేది పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అర్ధం కావడం లేదు. త్వరలోనే సారు గారిని లోపల వేస్తారనే టాక్ కూడా ఉంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చెరి గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేశారు ఆయన. ఆ తర్వాత వైసీపీ ఆయనకు మంగళగిరి సీటు ఇస్తుందని అందరూ భావించినా మహిళా నేతకు బ్రతిమిలాడి సీటు ఇచ్చారు. ఆళ్ళ మాత్రం నేను పోటీ చేయను అంటే చేయను అన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లి శర్మిలకు జగన్ కు మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం ఆయన చేసారని కూడా అన్నారు. అవేవి జరగలేదు… పైగా ఆళ్ళ రాజకీయంగా అక్కడి నుంచి కనుమరుగు అయిపోయిన పరిస్థితి. పార్టీ సమావేశాల్లో కూడా ఆళ్ళ పెద్దగా పాల్గొనడం లేదు.
అప్పట్లో పదే పదే తాడేపల్లి వెళ్ళిన ఆయన… ఇప్పుడు తాడేపల్లి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జగన్ కు నమ్మిన బంటు అనే పేరున్న నేత ఆయన. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారనేది అంతుబట్టడం లేదు. లోకేష్ కు భయపడి సొంత నియోజకవర్గంలో తిరగడం లేదు అని టీడీపీ నేతలు అంటుంటే… వైసీపీ విషయంలో ఆయనకు చేదు అనుభవాలు ఇంకా కృష్ణా నదిలో కనపడుతున్నాయని, అందుకే అసలు అటు వైపు చూసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇటీవల తన ఇంటికి పార్టీ నేతలు వెళ్తే… బాగున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, పిల్లలు బాగున్నారా లాంటి కుశల ప్రశ్నలు మాత్రమే అడిగారట.