Where is Gundu Boss ? : గుండు బాస్ కనిపించుటలేదు… అజ్ఞాతంలో లలిత జ్యువెలర్స్ కిరణ్ …. ఏమైపోయాడు? ఎక్కడున్నాడు?

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.... ఈ ఒక్క డైలాగ్ తో సౌత్ ఇండియాలో పాపులర్ అయిన  సెలబ్రిటీ బిజినెస్ మాన్, లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ జైన్ హఠాత్తుగా మాయమయ్యారు. ఆయన ఒకప్పటిలాXE టీవీల్లో కనిపించట్లేదు. రేడియోలో వినిపించట్లేదు. న్యూస్ పేపర్స్ లో భారీ ప్రకటనలు ఇవ్వట్లేదు. మీడియాకి ఇంటర్వ్యూలే లేవు. లలిత జ్యువెలరీ కిరణ్ ఏమైపోయాడా అంటూ దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని బంగారం వ్యాపారంలో కింగ్ గా పేరుపొందిన లలిత జ్యువెలరీ కిరణ్... ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడని వదంతులు నడుస్తున్నాయి. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని గాసిప్స్ తిరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 11:44 AMLast Updated on: Apr 04, 2024 | 11:44 AM

Where Is Gundu Boss Lalitha Jewellers Kiran Kumar Jain

డబ్బులు ఎవరికీ ఊరికే రావు…. ఈ ఒక్క డైలాగ్ తో సౌత్ ఇండియాలో పాపులర్ అయిన  సెలబ్రిటీ బిజినెస్ మాన్, లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ జైన్ హఠాత్తుగా మాయమయ్యారు. ఆయన ఒకప్పటిలాXE టీవీల్లో కనిపించట్లేదు. రేడియోలో వినిపించట్లేదు. న్యూస్ పేపర్స్ లో భారీ ప్రకటనలు ఇవ్వట్లేదు. మీడియాకి ఇంటర్వ్యూలే లేవు. లలిత జ్యువెలరీ కిరణ్ ఏమైపోయాడా అంటూ దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని బంగారం వ్యాపారంలో కింగ్ గా పేరుపొందిన లలిత జ్యువెలరీ కిరణ్… ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడని వదంతులు నడుస్తున్నాయి. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని గాసిప్స్ తిరుగుతున్నాయి.

దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో 52కు పైగా బంగారు ఆభరణాల షాప్స్ నెలకొల్పడమే కాకుండా, గోల్డ్ సేల్స్ లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్. తళ తళ మెరిసిపోయే గుండుతో, ఆకర్షణీయంగా మాట్లాడుతూ… బిజినెస్ లో ప్రత్యర్ధుల్ని చాలెంజ్ చేస్తూ… తన బంగారు నగలకి తానే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇండియాలోనే ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ తర్వాత చాలామంది బిజినెస్ మాన్ తమ ఉత్పత్తులకి తామే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు కూడా. ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ల కోసం సెలబ్రిటీల వెంట పరిగెట్టకుండా సెలబ్రిటీలు ఫేస్ చూపించి ప్రోడక్ట్ ని అమ్మే అవసరం లేకుండా, తన నగలని తానే అడ్వర్టైజ్ చేసుకున్నాడు కిరణ్. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, మా నగలు రేటు ఫోటో తీసుకోండి…. ఈ రేటు ఇంకెక్కడైనా ఉందేమో పోల్చి చూసుకోండి అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మార్కెట్లోకి దూసుకెళ్లాడు కిరణ్.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కేరళ, కర్ణాటకలో లలితా కిరణ్ ని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. సెలబ్రిటీలు కూడా ఈ బంగారు బోడి గుండుతో సెల్ఫీలు దిగుతారు. చిన్న తనంలో ఎన్నో కష్టాలు పడి, తిండికి లేని పరిస్థితి నుంచి వేలకోట్లకు ఎదిగాడు కిరణ్. 1985 నుంచి లలిత జ్యువెలర్స్ కు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తూ ప్రస్తుతం 18 వేల కోట్ల టర్నోవర్ వరకు ఆ సంస్థను చేర్చాడు. ఒక సెలబ్రిటీని గానీ…. ఓ పాపులర్ పర్సన్ గానీ నమ్ముకోకుండా తన బంగారాన్ని తానే అడ్వర్టైజ్ చేసుకుంటాడు కిరణ్. నిక్కచ్చి వ్యాపారస్తుడిగా పేరున్న లలితా జ్యువెలర్స్ కిరణ్ ని ఎదుర్కోవడం జాయ్ అలుకాస్, తనిష్క్, GRT లాంటి బడా కార్పొరేట్ గోల్డ్ వ్యాపార సంస్థలకు కూడా సాధ్యం కావట్లేదు. ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లతో జనాన్ని ముంచేత్తే కిరణ్.. ఈమధ్య ఆరు నెలల నుంచి మార్కెట్లో కనిపించడం లేదు. ఎక్కడా ఆయన ప్రకటనలు లేవు. మార్కెట్లో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆయన వ్యాపార ప్రత్యర్థులు ఆ వదంతులను ఇంకా పెద్దవి చేశారు. కిరణ్ బంగారం వ్యాపారంలో భారీగా నష్టపోయాడని, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, లలిత జ్యువెలర్స్ లో బంగారం కొనడం తగ్గిపోయిందని, సేల్స్ లేవని… లలితా కిరణ్ సంక్షోభంలో చిక్కుకున్నాడని మార్కెట్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కిరణ్ బ్యాంకులకు వేల కోట్లకు అప్పులు పడ్డాడని కూడా అంటున్నారు. ఆ మధ్య రాజ్యసభ సభ్యత్వం కోసం ఒక పొలిటికల్ బ్రోకర్ కి ఐదు కోట్లు రూపాయలు ఇచ్చి కిరణ్ మోసపోయాడట. అది ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు కూడా. ఇంత తెలివైన వ్యాపారి ఆర్థిక సంక్షోభంలో ఎందుకు చిక్కుకున్నాడు? వ్యాపారాన్ని  ఎలా దెబ్బ తీసుకుంటాడు? అనేది ఇప్పుడు మార్కెట్లో పెద్ద చర్చ. కావాలనే లలిత జ్యువెలర్స్ కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడనీ…. సొంత సమస్యలు పరిష్కరించుకొని మళ్లీ కొత్త ప్రకటనలతో మార్కెట్లోకి దూసుకొస్తాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.