బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ కీపర్ గా వారిద్దరిలో ఎవరు ?
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని ఫార్మాట్ లలో ఆడుతున్న గిల్, పంత్ వంటి ప్లేయర్స్ ను బంగ్లాతో టీ ట్వంటీలకు ఎంపిక చేయకపోవచ్చు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ మూడు టీ ట్వంటీల సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని ఫార్మాట్ లలో ఆడుతున్న గిల్, పంత్ వంటి ప్లేయర్స్ ను బంగ్లాతో టీ ట్వంటీలకు ఎంపిక చేయకపోవచ్చు. దీంతో పలువురు యువ క్రికెటర్లకు చోటు దక్కనుంది. పంత్ కు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లు వికెట్ కీపర్లుగా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వీరిద్దరూ కూడా ఇటీవల దేశవాళీ క్రికెట్ తో మళ్ళీ ఫామ్ అందుకున్నారు. అయితే ఇషాన్ కిషన్ ఇరానీ కప్ కు ఎంపికవడంతో సంజూ బంగ్లాతో టీ ట్వంటీలకు రేసులో ముందున్నాడు.
శ్రీలంక టూర్ లో నిరాశపరిచిన సంజూ శాంసన్ కు బంగ్లాతో సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే కివీస్ తో మూడు టెస్టుల సిరీస్ అనంతరం భారత్ టీ ట్వంటీ సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళుతుంది. అందుకే బంగ్లాపై సంజూ చెలరేగితే సఫారీ టూర్ కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇరానీ కప్ ముగిసిన తర్వాత బంగ్లాతో జరిగే మిగిలిన రెండు టీ ట్వంటీలకూ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం ఆరంభం కానుండగా.. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో టీ20, అక్టోబర్ 12న హైదరాబాద్ లో ఆఖరి టీ20 జరగనుంది.