Dolly Chaiwala: ఎవరీ డాలీ.. డాలీ వాలా ఛాయ్‌లో ఏంటి అంత స్పెషల్
అతని కాస్ట్యూమ్స్‌కు, చేసే పనికి అసలు సంబంధం ఉండదు. మంచి మోడల్ లుక్‌లో కేటీఎం బైక్ మీద వచ్చి ఛాయ్ అమ్ముతుంటాడు. ప్రజెంట్ ఇండియా టూర్‌లో ఉన్న బిల్‌గేట్స్ కూడా రీసెంట్‌గా అతని దగ్గర ఛాయ్ తాగాడు.

Dolly Chaiwala: సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఎవరు.. ఎలా ఫేమస్ అవుతారో ఎవరూ ఊహించలేరు. వైరల్ కంటెంట్‌తో రాత్రికి రాత్రే స్టార్స్ ఐపోయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఇలా తాము ఫేమస్ అవ్వడమే కాకుండా తమ వ్యాపారాలను కూడా ఫేమస్ చేస్తుంటారు. అలాంటి వ్యాపారాల్లో ఒకటే డాలీ వాలా ఛాయ్. మహారాష్ట్రలో ఈ డాలీ వాలా ఛాయ్ చాలా ఫేమస్. చాలా కాలంగా సోషల్ మీడియాలో ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Anant Ambani: ఖాన్స్ డ్యాన్స్.. నాటు నాటు పాటకు బాలీవుడ్ ఖాన్‌లు డ్యాన్స్
అతని కాస్ట్యూమ్స్‌కు, చేసే పనికి అసలు సంబంధం ఉండదు. మంచి మోడల్ లుక్‌లో కేటీఎం బైక్ మీద వచ్చి ఛాయ్ అమ్ముతుంటాడు. ప్రజెంట్ ఇండియా టూర్‌లో ఉన్న బిల్‌గేట్స్ కూడా రీసెంట్‌గా అతని దగ్గర ఛాయ్ తాగాడు. రోడ్డు పక్కన నిలబడి వన్ ఛాయ్ ప్లీజ్ అంటూ ఛాయ్ టేస్ట్ చేశాడు. ఆ వీడియోను ఇంటర్నెట్‌లో కూడా పోస్ట్ చేశాడు. ఏకంగా బిల్‌గేట్స్ లాంటి వ్యక్తి కూడా వెళ్లడంతో డాలీ వాలా ఛాయ్ మరోసారి ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయింది. బిల్‌గేట్స్ స్వయంగా వెళ్లి మరీ ఛాయ్ టేస్ట్ చేశాడు అంటే.. అక్కడ ఛాయ్ అంత ఫేమస్సా..? అసలు ఎవరీ వ్యక్తి..? ఎందుకు అతనికి అంత క్రేజ్..? ఇప్పుడు ఓ సగటు సోషల్ మీడియా యూజర్‌లో ఉన్న డౌట్స్ ఇవే. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సునీల్ పాటిల్ అనే యువకుడు ఉపాధి కోసం ‘టీ’ కొట్టు పెట్టుకున్నాడు. దానికి డాలీ వాలా ఛాయ్ అంటూ పేరు పెట్టాడు. హీరోలా కలర్ కలర్ డ్రెస్సులు వేసుకుని సూపర్ బైక్ మీద వస్తాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఇమిటేట్ చేస్తూ ఛాయ్ చేస్తాడు.
అదే స్టైల్‌లో కస్టమర్లకు అందిస్తాడు. ఇదే ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ పాయింట్. కొన్ని రోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో డాలీ వాలా ఛాయ్ పేరుతో పేజ్ క్రియేట్ చేశాడు. తన ఛాయ్ మేకింగ్ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంతే అప్పటి నుంచి సోషల్ మీడియాలో స్టార్ ఐపోయాడు. డాలీ వాలా ఛాయ్ దగ్గరకు వెళ్లేవాళ్లు అంతా ఛాయ్ తాగడం కంటే సునీల్‌ను చూడ్డానికే వెళ్తుంటారు. అతనితో సెల్ఫీలు తీసుకుంటారు. రీల్స్ కూడా చేస్తారు. ఇలాగే రీసెంట్‌గా బిల్‌గేట్స్ కూడా వెళ్లాడు. వన్ ఛాయ్ ప్లీజ్ అంటూ ఆర్డర్ ఇచ్చి ఛాయ్ టేస్ట్ చేశాడు. డాలీ వాలా ఛాయ్ తాగుతూ.. ఛాయ్ పే చర్చా కోసం వెయిట్ చేస్తున్నానంటూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతే దీంతో ఇంటర్నెట్ అంతా మరోసారి డాలీ వాలా ఛాయ్ పేరు మార్మోగిపోతోంది.
View this post on Instagram