No 2 in BRS: బీఆర్ఎస్‌లో నంబర్ 2 ఎవరు?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2023 | 10:49 AMLast Updated on: Feb 04, 2023 | 10:50 AM

Who Is No 2 In Brs

బీఆర్ఎస్‌లో నంబర్ 2 ఎవరు.. ఇంకెవరు కేటీఆర్ అని చాలామంది ఆన్సర్ ఇచ్చినా.. స్ట్రాంగ్‌, సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ! హరీష్ రావు ఉన్నారు అక్కడే.. అందుకే ఆ మాత్రం గ్యాప్‌ ! హరీష్ గులాబీ పార్టీకి ట్రబుల్ షూటర్‌ ! సమస్య వచ్చినప్పుడు తను రంగంలోకి దిగితేనే అవుతుంది.. తన వల్లే అవుతుంది అని అని ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు ఆయన ! ఉమ్మడి మెదక్ జిల్లాలో కారుకు, సారుకు చిన్న సమస్య కూడా ఎదురుకాకుండా కాపలా కాస్తుంటారు. పరిస్థితి చేయిదాటిందంటే.. రంగంలోకి దిగి గంటల్లో మ్యాటర్ సెటిల్ చేసిన సందర్భాలు ఎన్నో ! సిద్దిపేట అనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది అందుకే !

మాస్‌లీడర్‌గా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్న హరీష్‌.. పార్టీలోనూ తనకంటూ ఓ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గులాబీ పార్టీలో నంబర్ టు స్థానం కోసం కేటీఆర్‌, హరీష్ మధ్య పోటీ అంతా ఇంతా కాదు. హరీష్‌కు రాష్ట్రమంతా ఫాలోయింగ్ ఉందని.. కేటీఆర్‌కు అర్బన్ ఏరియాల్లో తప్ప పెద్దగా బలం లేదనే టాక్ ఉండేది. దీన్ని బ్రేక్ చేసి హరీష్‌ను వెనక్కి నెట్టి.. కేటీఆర్‌ను ముందు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారా అంటే.. నిజమే అనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.

రెండో దఫా అధికారం తర్వాత హరీష్‌ను నిర్లక్ష్యం చేసింది.. కేటీఆర్‌ను ముందుకు నెట్టింది అందుకే అనే టాక్ ఉంది. ఇది జనం మాటే కాదు. రాజకీయం మాట కూడా ! పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినపుడే ఇది క్లియర్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. ఈ మాటలకు మరింత బలం ఇచ్చాయ్.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారింది. ఢిల్లీ రాజకీయాలకు సిద్ధం అవుతున్నారు కేసీఆర్ ! ఇలాంటి టైమ్‌లో రాష్ట్ర పార్టీ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకే హరీష్‌ను వెనక్కి నెట్టి.. కేటీఆర్‌కు ప్రత్యేకంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు కేసీఆర్‌ ! ముఖ్యంగా మారుమూల గ్రామాల జనాలకు కూడా కేటీఆర్‌ను చేరువ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీపరంగా బాధ్యతలన్నీ కేటీఆర్‌ చేతుల్లోనే ఉన్నా.. జననేతగా సిరిసిల్లకు మాత్రమే పరిమితం చేయకుండా.. రాష్ట్రం అంతా ఆ వేవ్‌ కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్‌ ! కేటీఆర్‌లోనూ ఓ ఛేంజ్‌ పక్కాగా కనిపిస్తోంది. మాటలు, నడకతీరు అన్నీ.. గ్రౌండ్ లెవల్‌లో జనాల మనసులు తాకేలా కనిపిస్తున్నాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌ మార్క్ మాటలు.. కేటీఆర్‌ నోటి నుంచి వినిపిస్తున్నాయ్ ఇప్పుడు ! తనకంటూ ఓబ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.. పాపులారిటీ తెచ్చుకున్నారు. దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం మీదే మిగతాది ఆధారపడి ఉంటుంది.

మరి ఇప్పుడు హరీష్ పరిస్థితి ఏంటి.. ఇక కష్టమేనా అనే చర్చ జరుగుతోంది. నిజానికి తనను నిర్లక్ష్యం చేసినప్పుడు… మంత్రిపదవికి దూరంగా ఉంచినప్పుడు కూడా హరీష్ పెద్దగా రియాక్ట్ కాలేదు. అంతకుముందు ఎలా ఉన్నారో.. ఆసమయంలోనూ పార్టీకి అంతే లాయల్‌గా కనిపించారు. కష్టం తనదైనా.. అదే కష్టం పార్టీ ఆఫీస్ కాంపౌండ్ దాటకుండా కాపలా కాశారు. ఇకపై కూడా అలానే ఉండే చాన్స్ ఉంటుంది తప్ప.. అంతకుమించి జరిగేదేమీ లేదనే అభిప్రాయాలు ఉన్నాయ్. ఏమైనా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. రాజకీయంలో హీరోలు, విలన్లు ఉండరు అనే డైలాగ్ గుర్తుచేసుకునేవాళ్లూ ఉన్నారు మరి !

(N)