Telangana Rajya Sabha : కాంగ్రెస్ లో రాజ్యసభకి వెళ్ళేదెవరు ? వీళ్ళకి గ్యారంటీయేనా ?
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల (Telangana Rajya Sabha Elections) వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు జరగబోతున్న మూడు సీట్లలో రెండు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఆ రెండిటికి అభ్యర్థులు ఎవరన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ హాట్‌గా జరుగుతోంది.

Who will go to Rajya Sabha in Congress? What is the guarantee for them?
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల (Telangana Rajya Sabha Elections) వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో (Congress Party) హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు జరగబోతున్న మూడు సీట్లలో రెండు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఆ రెండిటికి అభ్యర్థులు ఎవరన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ హాట్‌గా జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేంద్ర నాయకత్వానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి సిఫారసులు వెళ్ళవన్న క్లారిటీ వచ్చినట్టయింది.
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్తారు ? ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించబోయే ఇద్దరు అభ్యర్థులు రాష్ట్రానికి చెందినవారే అయి ఉంటారా? లేక వేరే రాష్ట్రాల నాయకులు ఉంటారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో సోనియాగాంధీని (Sonia Gandhi) లోక్‌సభ లేదా రాజ్యసభకు తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అందుకు సుముఖంగా ఉన్నారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వస్తున్నాయట. ఆ విషయమై గాంధీ కుటుంబం క్లారిటీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ సోనియా గనుక తెలంగాణ నుంచి రాజ్యసభ బరిలో నిలవకుంటే… రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలకు ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. సీటు కోసం పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
దీంతో తమకు తలనొప్పులు తప్పవని భావిస్తున్నారట పీసీసీ పెద్దలు. అందుకే నిర్ణయాధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ… తీర్మానించినట్టు తెలిసింది. పార్టీ సీనియర్ లీడర్స్ జానారెడ్డి, వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్… ఇలా చాలా మంది రాజ్యసభ సీటు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. వీరితో పాటు హైకమాండ్ దృష్టిలో ఇంకెవరు ఉన్నారో క్లారిటీ రాలేదు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను పీసీసీ తన పరిధి నుంచి ఏఐసీసీ కోర్ట్‌లోకి నెట్టేయడంతో ఢిల్లీ లాబీయింగ్‌తో సీటు పట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారట సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది. సీట్లు తక్కువ, ఆశావహులు ఎక్కువ కావడంతో అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ పెద్దలు ఫైనల్ చేసేదాకా అభ్యర్థులు ఎవరన్న సంగతి గాంధీభవన్‌కు తెలిసే అవకాశాలు లేనందున ఎవరి ప్రయత్నాల్లో వారు బీజీగా ఉన్నారట. కాంగ్రెస్ కోటాలో రాజ్యసభలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి.